పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున అందరినీ ఆకర్షించిన అంశం సచిన్ టెండూల్కర్ సభకు హాజరు కావడం. నామినేటెడ్ రాజ్యసభ మెంబర్ గా ఉన్న సచిన్ తొలిరోజున రాజ్యసభ మీటింగ్ కు హాజరయ్యాడు. ఎంపీ హోదాలో సచిన్ సభకు వచ్చి అందరి దృష్టినీ ఆకర్షించాడు. క్రికెట్ నుంచి రిటైర్డ్ అయిన టెండూల్కర్ ఈ విధంగా సభకు రావడం ఆసక్తికరమైన అంశమే.  మరి సచిన్ ఇలా సభకు హాజరు కావడం ఏదో ఒక రోజు పనా.. లేక సమావేశాలు కొనసాగినన్ని రోజులూ ఆయన సభకు వస్తాడా? అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. ఇది వరకూ సచిన్ విషయంలో ఇదొక వివాదం అయ్యింది. టెండూల్కర్ ఎంపీగా ఉండి సభకు రావడం లేదని కొంతమంది రాజ్యసభ సభ్యులే రచ్చ చేశారు. సచిన్ తో పాటు రేఖ విషయంలో కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. మరి వివాదాలకు దూరంగా ఉంటాడనే పేరున్న సచిన్ ఆ విధంగా రాజకీయ వాదుల మధ్య వివాదంలో పడ్డాడు. ఈ నేపథ్యంలో శీతాకాల సమావేశాల సందర్భంగా మాత్రం సచిన్ సభకు హాజరు కావడం విశేషం.  మరి ఇక నుంచి సచిన్ వరసగా సభకు హాజరు అయితే... వివాదం ఏమీ ఉండకపోవచ్చు. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్్ అయిన స చిన్ సభకు హాజరు అయితే తన బాధ్యతను నెరవేర్చిన వాడే అవుతాడు. మరి రిటైర్ మెంట్ తర్వాత కూడా సచిన్ బిజీ షెడ్యూల్ తోనే ఉన్నాడు. మరి ఈ షెడ్యూల్ ఆయన సభకు ఎంత సమయాన్ని కేటాయించగలుగుతాడో మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: