పిసిసి మాజీ అద్యక్షుడు బొత్స సత్యనారాయణ భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం పై మళ్లీ కధనాలు వస్తున్నాయి. కొద్ది కాలం క్రితం ఈ వార్తలు ప్రచారం అయినా, ఆయన కాంగ్రెస్ లో కొంత యాక్టివ్ గానే కనిపించారు.కాని ఈ మధ్య కాలంలో ఆయన పెద్దగా కాంగ్రెస్ కార్యకలాపాలలో కనిపించడం లేదు. ఇప్పటికే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరిన నేపధ్యంలో తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన నేతగా ఉత్తరాంద్రలో తనకంటూ కొంత పాలోయింగ్ ఉన్న బొత్స కు ప్రాధాన్యత ఏర్పడింది. కాపులను ఆకట్టుకోవడం ద్వారా ఎదగాలని బిజెపి యోచిస్తున్నదని,దానికి తగ్గట్లుగానే ఆ సామాజికవర్గం నేతలు కూడా ముందుకు వస్తున్నారని అంటున్నారు.అంతేకాక టిడిపికి ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఈ అవకాశం వాడుకుంటున్నారని చెబుతున్నారు.బొత్సకు,టిడిపికి మధ్య పూర్తి వైరం ఉంది.అలాంటి పరిస్థితిలో నిజంగానే బొత్స బిజెపిలో చేరితే అది టిడిపికి కొంత ఇరకాటమే అవుతుంది.ఇప్పటికే కన్నా వంటి వారు చేరడం టిడిపికి మింగుడుపడని అంశమే.బిజెపి అద్యక్షుడు అమిత్ షాను బొత్స కలిశారని కూడా ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: