భారతీయ జనతా పార్టీని ముఖ్యమంత్రి కెసిఆర్ మెచ్చుకున్నారు.ఇది రాజకీయం కోసం కాకపోయినా, సందర్భం మాత్రం ఆసక్తికరమైనది. తమకు అమరవీరుల అంశంపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్న కారణంగా బిజెపి నేతలు కిషన్ రెడ్డి తదితరులు శాసనసభలో నిరసన తెలుపుతున్నప్పుడు ,ముఖ్యమంత్రి కెసిఆర్ జోక్యం చేసుకుని బిజెపి తెలంగాణ ఉద్యమంలో అమోఘమైన పాత్ర పోషించిందని ప్రశంసించారు. తెలంగాణ పై అనుమానాలు కలిగిన తరుణంలో తాను రాజ్ నాద్ సింగ్ ను కలిశాను. ఆ తర్వాత ఆయన పార్టీని తెలంగాణపై ఒప్పించారు.అలాగే రాజ్యసభలో చిక్కులు వచ్చినప్పుడు అరుణ్ జైట్లి బాగా సహకరించారు అని అన్నారు.జెఎసిలకు దత్తాత్రేయ,కిషన్ రెడ్డిలు కూడా సహకరించారు.వారి పాత్రను మర్చిపోలేనిది అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: