ఏపీ సీఎం చంద్రబాబు జపాన్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. అనేక కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల అధినేతలతో ఏపీ అభివృద్దిపై చర్చిస్తున్నారు. రాజధాని నిర్మాణం, ఏపీ అభివృద్ధి, తీర ప్రాంత సద్వినియోగం వంటి విషయాలపై సలహాలు తీసుకుంటున్నారు. మరి అవన్నీ వర్క్ ఔట్ అవుతాయా లేదా అన్నది తర్వాత సంగతి.. ముందైతే ఓ ప్రయత్నం జరుగుతోంది అన్న అభిప్రాయం చాలామందిలో కనిపిస్తోంది.                                              ఐతే.. చంద్రబాబు పర్యటనపై విమర్శలు కూడా అదేస్థాయిలో వస్తున్నాయి. చంద్రబాబు టూర్ ఓ పబ్లిసిటీ స్టంట్ అని విమర్శిస్తున్నారు వైకాపా నేతలు. ఏపీలో రైతులు, రైతుకూలీలతో పాటు అన్ని వర్గాలు కష్టాల్లో ఉంటే.. చంద్రబాబు కోట్ల రూపాయల సర్కారు సొమ్ముతో విదేశీ పర్యటనల పేరుతో షికార్లు కొడుతున్నారని మండిపడుతున్నారు. ఇప్పుడు వీరికి పార్ట్ టైమ్ పొలిటీషియన్, సినీనటి రోజా కూడా తోడయ్యారు. ఈవిడ జపాన్ టూర్ వృధా అని మాట్లాడకుండా చంద్రబాబు వెంట జపాన్ వెళ్లినవారిపై దృష్టిపెట్టారు.                         జపాన్ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట.. వెళ్లింది సారా వ్యాపారులు, మనీ లాండరింగ్, విద్యావ్యాపారులు, సంచులు మోసే వారేనంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది రోజా. చంద్రబాబు చేతకానితనం వల్లే రాష్ట్రం విడిపోయిందని ఆమె విమర్శించారు. ఏపీ సీఎం.. వందలకొద్దీ హామీలు ఇచ్చి.. ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికల తర్వాత మారకపోగా, మరింత మోసగాడిలా మారారని రోజా విమర్శించారు. చంద్రబాబు వెంట.. సారా వ్యాపారులు, మనీ లాండరింగ్, విద్యావ్యాపారులు, సంచులు మోసే వారు జపాన్ వెళ్లారని విమర్శించిన రోజా... వారిని పేర్లతో సహా వివరిస్తే ఇంకాస్త బావుండేదంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: