మహారాష్ట్ర ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ గురువారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఉద్ధవ్‌ థాకరే నేతృత్వంలోని శివసేన కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో ఉందని, మహారాష్ట్ర ప్రభుత్వంలోని ఆ పార్టీ భాగస్వామిగా ఉంటుందని చెప్పారు. తమ రెండు పార్టీలు కూడా కలిసి ఉండాలనుకుంటున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. తమ రెండు పార్టీలు కూడా ప్రభుత్వాన్ని మహారాష్ట్రలో కలిసి రన్‌ చేయాలనుకుంటున్నాయని చెప్పారు. తాను శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరేతో కొద్ది రోజుల క్రితం మాట్లాడానని చెప్పారు. మరోసారి ఆయనతో తాను మాట్లాడుతానని చెప్పారు. అలయెన్‌‌స ప్రభుత్వాన్ని నడిపేందుకు తమ ప్రభుత్వం తరఫున రేపటి నుండి చర్చలు ప్రారంభిస్తామని చెప్పారు. ఇరువైపుల నుండి సానుకూల నిర్ణయమే వస్తుందని తాను భావిస్తున్నానని ముఖ్యమంత్రి తెలిపారు. కాగా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్‌ షా, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరేలు మహారాష్ట్ర ప్రభుత్వంలో సేన విషయమై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్‌ డిమాండ్‌ మేరకు ఫడ్నవిస్‌ మంత్రివర్గంలోకి పదిమంది శివసేన వారిని తీసుకునే అవకాశముందని అంటున్నారు. నలుగురికి కేబినెట్‌ ర్యాంక్‌ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. శివసేన గతంలో ఉప ముఖ్యమంత్రి పదవి కోసం డిమాండ్‌ చేసిందని సమాచారం. హోం మినిస్టర్‌ పోర్‌‌ట పోలియోను శివసేన కోరుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు పవర్‌, పీడబ్లు్యడీ, హెల్‌‌త అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ పోర్‌‌ట పోలియోలు సేనను వరించే అవకాశముందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: