రాజధాని అంటే ఎలా ఉండాలి..? రాజధాని నిర్మాణానికి ఏది కరెక్ట్ మోడల్..? రాజధాని కేవలం పరిపాలన కేంద్రంగా ఉంటే చాలా..? రాజధాని నగరంలో ఎలాంటి హంగులుండాలి..? ఇప్పుడు ఏపీ రాజధాని గురించి తలెత్తుతున్న అనేక ప్రశ్నల్లో ఇవి కొన్ని. ఓ కొత్త రాజధాని నిర్మించడమేనేదే ఓ కొత్త టాస్క్. గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ చేయనిది. అందుకే చంద్రబాబు టీమ్.. దేశంలోని అనేక మోడళ్లు పరిశీలించింది.                                         ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్, గుజరాత్ రాజధాని గాంధీనగర్ లు పరిశీలించిన తర్వాత.. ఏపీ రాజధాని అలా ఉండకూడదన్న అభిప్రాయానికి చంద్రబాబు వచ్చారు. రాజధాని అంటే కేవలం ప్రభుత్వ కార్యాలయాలు, పరిపాలన కేంద్రాలు మాత్రమే కాదని.. ఆయన భావిస్తున్నారు. ఈ రెండు నగరాల్లో పెద్దగా ప్రజాజీవనం కనిపించదు. ఏపీ కొత్త రాజధాని అలా ఉండకూడదని భావిస్తున్న చంద్రబాబు... ప్రజల ఆనందమయ జీవితానికి అన్ని ఏర్పాట్లు ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే తుళ్లూరులో సేకరించే 30 వేల ఎకరాల్లో.. 2 వేల ఎకరాలు సామాజిక జీవనం కోసం కేటాయించాలని ప్లాన్ చేస్తున్నారు.                        ఏపీ రాజధాని రాయ్ పూర్, గాంధీనగర్ ల తరహాలో కాక.. మల్టీప్లెక్ ధియేటర్లు, బహుళ అంతస్తుల ఆకాశ హర్మ్యాలు, వాణిజ్య కేంద్రాలు, ఉద్యానవనాలు, స్టార్ హోటళ్లు, వసతి గృహాలు... ఇలా అన్ని రకాల సౌకర్యాలు ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు. అంతే కాదు.. కొత్త రాజధానిని సినీ, టీవీ రంగాల కేంద్రంగా కూడా తీర్చిదిద్దుతారట. ఎంటైర్టైన్ మెంట్ సిటీ కడతారట. ఏపీ రాజధానిని పరిపాలన, వినోద, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. ఇవన్నీ చేస్తే.. మళ్లీ హైదరాబాద్ తరహాలో అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమవటం ఖాయం కదా..

మరింత సమాచారం తెలుసుకోండి: