ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరో వివాదం అతి తర్వలోనే రాజుకొనే అవకాశం కనిపిస్తోంది. ఇన్ని రోజులూ నీళ్లు, కరెంట్‌, కొన్నిశాఖల్లో పెత్తనంపై ఈరెండు రాష్ట్రాల మధ్య వివా దాలు చెలరేగగా.. ఈసారి డబ్బు విషయంలో వివాదం రేగేలా ఉంది. అది కూడా భారీ మెత్తం విషయంలో..ఏకంగా 214 కోట్ల రూపాయల విష యంలో ఏపి టిఎస్‌ ప్రభుత్వాల మధ్య వివాదం రేగే అవకాశాలు కనిపి స్తున్నాయి. చాలా మెలికలు పడివున్న ఈవివాదం తిరుపతి తిరుమల దేవ స్ధానం సంబంధించి తమకు టిటిడి నుంచి రూ.214 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నాయని తెలంగాణ శాసనసభలో వరుసగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. మరి ఈ నిధులు ఎందుకు రావాలి? అనే విషయాన్ని తోడితే చాలా పెద్ద కధే ఉంది. అది రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయం 2003నుంచి 2013 వరకు టిటిడి దేవాదాయశాఖకు దాదాపు ఆరువందల కోట్ల రూ పాయల బాకీ పడింది.  ఈవిషయం కాగ్‌ నివేదికలో ఉందట. దేవా దర్మాదాయశాఖకు కట్టాల్సిన డబ్బును టిటిడి చెల్లించలేదట. ఇప్పుడు ఈ డబ్బును చెల్లించాలని తమ వాటా కింద రూ.214 కోట్ల రూపాయలు జమ చేయాలని హరీష్‌రావు అంటున్నారు. ఇప్పటికే ఈవిషయాన్ని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన పూజారి సౌందర్య రాజన్‌ హరీష్‌ దృష్టికి తీసు కుని వచ్చారు. హరీష్‌ లెక్క తెలంగాణ వాదులకు బాగానే ఉంటుంది. సీమాం ధ్రలో కొలువైన ఉన్న వెంకన్న దేవాలయం నుంచి తెలంగాణ దేవాదా యశాఖకు తక్షణం డబ్బు చెల్లించాలని తెలంగాణవాదులు డిమాండ్‌ చేస్తు న్నారు. అయితే టిటిడి ఆడబ్బును చెల్లింస్తందా? అనేది సందేహామే.  పది సంవత్సరాల పాటు డబ్బు చెల్లించకుండా గడిపేసిన టిటిడిపి ఇప్పుడ ఇస్తుం దా అనేది అర్చకుల్లో తలెత్తున్న ప్రశ్న. నిధుల విషయంలో ఎలాంటి కొరత లేని దేవస్ధానం బోర్డు దేవాదాయశాఖకు ఆడబ్బు చెల్లించలేదు. 2003 నుంచి 2013 వరకు అంటూ హరీష్‌రావు చెబుతున్నారు. మరి అలాంటి టిటిడి ఇప్పుడు కానీ ఆసొమ్ము కడుతుందా? అనేది పెద్ద ప్రశ్న. తక్షణం సొమ్ము ఇవ్వాలని హరీష్‌రావు అంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: