ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ లో మీడియా ను ఉద్దేశించి మాట్లాడారు.దీనిని ఎపి టీవీలు లైవ్ కవరేజీ ఇచ్చాయి. జపాన్ కంపెనీలను తాము ప్రమోట్ చేస్తామని, తద్వారా ఎపిలో పెట్టుబడులు పెట్టడాన్ని ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశాన్ని కొత్త దిశలో నడిపిస్తున్నదని ఆయన చెప్పారు. తాము కొత్త రాజధాని నిర్మిస్తున్నామని,ఇది అరుదైన అవకాశం అని అన్నారు. తాము అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మాణం చేపడుతున్నామని అన్నారు.ఇది రాజకీయ రాజధానిగానే కాకుండా, ఆర్ధిక,సామాజిక రాజధాని అవుతుందని అన్నారు. రాజధాని నిర్మాణానికి సింగపూర్ సహకరించడానికి ముందుకు వచ్చిందని చంద్రబాబు తెలిపారు.2029 నాటికి ఎపిని పూ్తి స్థాయిలో అబివృద్ది చేసే లక్ష్యంగా పని చేస్తున్నామని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: