హైదరాబాద్ లో ఉంటూ ఎపిలో వ్యవసాయ రుణాలు తీసుకున్నవారికి రుణమాఫీ వర్తింప చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై తాజాగా ప్రభుత్వం కూడా దృష్టి పెట్టిందని కదనాలు వస్తున్నాయి. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న నేపధ్యంలో అనేకమంది హైదరాబాద్ వచ్చి ,చిన్న,చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు.వారిలో చాలమందికి కొద్దో,గొప్పో భూములు ఎపిలో ఉన్నాయి.వారెవ్వరికి రుణమాఫీ జరగలేదు.దీనిపై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధికార ప్రతినిది వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆధార్ కార్డు, నివాసం అన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయని, ఆయన ముఖ్యమంత్రి అయితే తప్పు లేదుకాని, హైదరాబాద్ లో ఉండి పంటరుణం తీసుకుంటే తప్పా అని ప్రశ్నించారు.హైదరాబాద్ నుంచి వేలాది మందిని తరలించి ఓట్లు వేయించుకున్నప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా అని ఆమె అన్నారు.ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఆధార్ కార్డు, ఇతర డేటాబేస్ ను తెలంగాణ ప్రభుత్వం నుంచి సహకారం పొంది తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.అయితే దీనిపై తుది నిర్ణయానికి రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: