ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, కేంద్రం ఊహించని విధంగా షాక్‌ ఇచ్చింది. హుదూద్ నష్టం చంద్రబాబు సర్కార్‌ చెప్పినంతగా లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. హుదూద్ తుపానుతో రూ. 22 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఏపీ ప్రభుత్వం లెక్కకట్టిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అంచనాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ క్రమంలో, తుపాను ప్రభావిత ప్రాంతానికి ఓ కేంద్ర బృందం వచ్చి పరిశీలన జరిపింది. చివరకు హుదూద్ తుపాను నష్టం కేవలం రూ. 680 కోట్లే అని తేల్చేసింది. ఇంతకన్నా తాము ఎక్కువ సాయం చేయలేమని స్పష్టం చేసింది. తుపాను సమయంలో విశాఖను సందర్శించిన ప్రధాని మోదీ… అప్పటికప్పుడు రూ. 1000 కోట్లను తక్షణ సాయంగా ప్రకటించారు. ఇప్పటికే రూ. 400 కోట్లు రాష్ట్రానికి వచ్చాయి. ఈ క్రమంలో, కేంద్రం కొత్త అంచనాల ప్రకారం రాష్ట్రానికి ఇంకా రావాల్సింది రూ. 280 కోట్లు మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి: