కాంగ్రెస్‌ పార్టీ యువనేతలు ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డిల మధ్య చోటుచేసుకున్న గొడవ ఇంకా సద్దుమణ గలేదు. ఇద్దరు నేతలూ తమ తమ వాదనను పార్టీ నేతలకు బలంగా విన్పిస్తున్నారు. శుక్ర వారం పెళ్లిలో చోటుచేసుకున్న ఘర్షణ విష యమై ఆ ఇద్దరు యువనేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉం డగా యూత్‌ కాంగ్రెస్‌ నేతలిద్దరి మధ్య చోటు చేసుకున్న గొడవ పార్టీకి నష్టాన్ని చేకూరుస్తుం దని భావిస్తున్న పార్టీ సీనియర్‌ నేతలు సమ స్యకు పుల్‌స్టాప్‌ పెట్టే పనిలో ఉన్నారు. వంశీ చంద్‌రెడ్డితో ఇప్పటికే పొన్నాల మాట్లాడి గొడవకు కారణాలను అడిగి తెలుసుకున్న విషయం తెలిసిందే. అలాగే సీఎల్పీ నేత కే. జానారెడ్డి సైతం శుక్రవారం వంశీచంద్‌ నివా సానికి వెళ్లి పరామర్శించగా శని వారం రాజ్య సభ సభ్యుడు వి. హను మంతరావు వంశీని తన ఇంట్లో కలిసి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వంశీచం ద్‌, విష్ణువర్ధన్‌లిద్దరూ యువ నాయకు లు. దూకుడుగా ఉన్నారు. వారిద్దరితోనూ మాట్లా డతాం. పార్టీకి నష్టం జరగకుండా చూస్తాం. ఇది చిన్న సంఘటన, చాలా చిన్న విషయం, ఉద్రేకంలో జరిగిన గొడవను మర్చి పార్టీ కోసం వారు పని చేసేలా వారిని కూర్చో పెట్టి మాట్లాడతామని స్పష్టం చేశారు. వంశీ, విష్ణుల మధ్య జరిగిన గొడవను మీడియా టీ పీసీసీ చీఫ్‌ పొన్నాల దృష్టికి తీసు కెళ్లగా ... అది కుటుంబ సభ్యుల వ్యవహారం. వారిద్దరూ చుట్టా లు. పార్టీ పరంగా చోటు చేసుకుంది కాదు. ఆ సంఘటన గురించి మాట్లాడాల్సి అవసరంలేదంటూనే ఇద్దర్ని కూర్చొబెట్టి మాట్లాడతామని ఎందుకు అనుకోవటం లేద ని ఆయన మీడియాను ఎదురు ప్రశ్నించారు. ఆ ఇద్దరు యువ నేతల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ విషయమై రాహుల్‌ గాంధీ టీపీసీసీ చీఫ్‌ వద్ద ఆరా తీసినట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: