శారద కుంభకోణంలో తన మంత్రిని అరెస్టు చేయడంపై ఆగ్రహోదగ్రు రాలైన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సహారా స్కాములో ప్రధాని మోడీని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేయొచ్చా అని ప్రశ్నించారు . శారద సంస్థ అధిపతితో మంత్రి కలిసి ఫోటో దిగడమే నేరమైతే సహారా అది óపతితో ప్రధాని నరేంద్రమోడీ కలిసి ఫొటోలు దిగడమూ నేరమే కదా అన్నారు. ఈ కార ణంతో మదన్‌ మిత్రాను అరెస్టు చేసినప్పుడు ఆయన్ను (మోడీని) కూడా అరెస్టు చేయాలని తాము డిమాండ్‌ చేయకూడదా అని అమె ప్రధానిపై ధ్వజమెత్తారు. కేంద్రం నుండి వచ్చిన ఒక ఫోన్‌ కాల్‌తో సిబిఐ తమ మంత్రిని విచారించిందని ఆమె ఆరోపించారు. సాక్షిగా విచారించేందుకు పిలిచి అరెస్ట్‌ చేస్తే ఇక ఎవరూ సాక్ష్యం చెప్పేందుకు ముందుకు రారని ఆమె అన్నారు. శారదా కుంభకోణంలోని నిందితులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తృణమూల్‌ కాంగ్రెస్‌ నిర్వహించిన ర్యాలీనుద్దేశించి మమత మాట్లాడుతూ సిబిఐ ఈ కుంభకోణంలో అరెస్టు చేసిన మంత్రి, ఎంపీలంతా అమాయకులేనని, సిబిఐ కావాలని వారిని ఇందులో ఇరికించిదని నమ్మబలికారు. సిబిఐ చర్య దేశ ఫెడరల్‌ వ్యవస్థను దెబ్బతీసే దిగా వుందని విమర్శించారు. తృణమూల్‌ నిరసనల సందర్భంగా రహదారులను దిగ్బం ధించారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. అరెస్టయిన మంత్రిని కోర్టుకు తీసుకెళుతుంటే వారినీ అడ్డుకున్నారు. టిఎంసి కార్యకర్తలు ఇలా రెచ్చిపోయి గూండాగిరీ చేస్తుంటే రాష్ట్ర పోలీసులు మౌన ప్రేక్షకుల్లా చూస్తూ నిల్చు న్నారు. వందలాదిమంది టిఎంసి మద్దతు దారులు గుమిగూడినా వారిని చెదరగొట్టేం దుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: