హుదూద్ తుపాను గురించి తొలి రోజు నుంచి నష్టం అంచనాలు కొనసాగుతున్నాయి. సహాయ కార్యక్రమాల సంగతి గురించి మాట్లాడాల్సిన దశ నుంచే ఏపీ ముఖ్యమంత్రి జరిగిన నష్టం .. కేంద్రం పూడ్చాల్సిన నష్టం అని ప్రకటనలు చేస్తూ వచ్చాడు. తొలి రోజే తుపాను ను జయించామని ప్రకటించేశాడు ఏపీ ముఖ్యమంత్రి. అయితే హుదూద్ తుపాను బాధిత ప్రాంతాల్లో ఇప్పటికీ కొన్ని చోట్లకు విద్యుత్ పునరుద్ధరణ జరగలేదు. ఇక ఆర్థిక సాయం అయితే ఇంత వరకూ ఎవరికీ ఒక్క రూపాయి కూడా దక్కినట్టుగా వార్తలు రాలేదు. తక్షణ సాయం గురించి కూడా ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన మరింత చోద్యంగా ఉంది. హుదూద్ తుపాను వల్ల జరిగిన నష్టం కేవలం 600 కోట్ల రూపాయల చిల్లర మాత్రమేనని కేంద్ర బృందం స్పష్టం చేసింది. అయితే ఏపీ ప్రభుత్వ లెక్కల ప్రకారం హుదూద్ నష్టం దాదాపు 20 వేల కోట్ల రూపాయలు. కానీ కేంద్ర ప్రభుత్వ లెక్కలు మాత్రం ఏపీ అంచనాలకూ చాలా దూరంగా ఉన్నాయి. మరి ఇది కచ్చితంగా ఏపీ గవర్నమెంటుకు.. భారీ నష్టం అని ప్రకటన చేసి ముఖ్యమంత్రికి షాక్ అనే చెప్పవచ్చు.  ఎక్కడ ఇరవై వేల కోట్ల రూపాయలు.. ఎక్కడ ఆరువందల కోట్ల రూపాయలు.. ఏమైనా పొంతన ఉందా? హుదూద్ ను జాతీయ విపత్తుగా ప్రకటించలేమని... కేంద్రం ఇది వరకే స్పష్టం చేసింది. మరి ఇప్పుడు నష్టం అంచనాల విషయంలో కూడా కేంద్రం ఏపీ కి చుక్కలు చూపుతోంది. మొత్తానికి సెంట్రల్ గవర్నమెంటు ఇలా చేతులు దులిపేసుకొంది!

మరింత సమాచారం తెలుసుకోండి: