ఇప్పటికే కాంగ్రెస్ వాళ్లు అందుకొన్నారు. కేసీఆర్ వి ఊసరవెల్లి రాజకీయాలు అని వారు విమర్శిస్తున్నారు. గతంలో రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు అది తెలంగాణకే తలమానికం అనడాన్ని కాంగ్రెస్ వాళ్లు విమర్శిస్తున్నారు. కేసీఆర్ ఇలా మాటలు మార్చేస్తూ ఉంటాడని... ఇలా రంగులు మార్చడంలో ఆయన ఊసరవెల్లితో పోటీ పడతాడని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రామోజీ ఫిల్మ్ సిటీ సందర్శన అనేది రాజకీయ వర్గాల్లోకచ్చితంగా ఆసక్తిని రేపే అంశమే. రామోజీ ఆంధ్రా వ్యక్తి కావడం.. హైదరాబాద్ లో భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని కలిగి ఉన్న వ్యక్తి కావడం.. తెలుగుదేశం పార్టీ మద్దతుదారు.. తన మీడియా ద్వారా తెలుగుదేశానికి జాకీలు వేసే ప్రయత్నం చేస్తుంటాడనే పేరు బడ్డ వ్యక్తి కావడంతో కేసీఆర్- రామోజీల భేటీ ఆసక్తిని రేపుతోంది. ఒకవైపు తెలంగాణలో ఆంధ్ర పారిశ్రామిక వేత్తలపై కొంత వ్యతిరేకత ఉంది. వారు తమను దోచుకొంటున్నారనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు తెలంగాణ మేధావులు. ఇలాంటి నేపథ్యంలో స్వయంగా కేసీఆర్ వెళ్లి రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించడం... రామోజీని ప్రశంసించడం తెలంగాణలోని కొన్ని వర్గాలు సహించలేవనడంలో సందేహం లేదు! మరి రామోజీని పొగడటం వల్ల కేసీఆర్ కు వ్యక్తిగతంగా లబ్ధి ఏమో కానీ.. రాజకీయంగా మాత్రం కచ్చితంగా మైనస్సే. తెలుగుదేశం వాళ్లు కాదు కానీ.. మిగతా వాళ్లు మాత్రం కచ్చితంగా ఇకపై కేసీఆర్ పై ధ్వజమెత్తేటప్పుడు ఈ విషయాన్ని కూడా అస్త్రంగా మార్చుకొంటారు! కేసీఆర్ ఆంధ్రా పారిశ్రామిక వేత్తల అగుగులకు మడుగులెత్తుతున్నాని అంటారు. నో డౌట్!

మరింత సమాచారం తెలుసుకోండి: