ఒకేచోట అన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసి రియల్ ఎస్టేట్ ను పెంచడమే అబివృద్ది కాదని లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు. విశాఖలో ఆయన మాట్లాడారు. రాజధాని విషయంలో జరుగుతున్న తీరు,తెన్నులను ఆయన ఆక్షేపించారు. వికేంద్రీకరణ చాలా అవసరమని, హైకోర్టుతో పాటు,బెంచ్ లను ఎపిలో వేర్వేరు ప్రాంతాలలో నెలకొల్పాలని సూచించారు.రాయలసీమ,ఉత్తరాంధ్రలపై దృష్టి ఎక్కువగా పెట్టాలని జెపి సూచించారు.మహారాష్ట్ర తరహాలో అసెంబ్లీని కూడా వేర్వేరు చోట్ల ఏర్పాటు చేయాలని జెపి అబిప్రాయపడ్డారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అంతా ఒకే చోట కేంద్రీకరిస్తున్నారన్న విమర్శల నేపధ్యంలో జెపి ఈ వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: