కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం గురించి మాట్లాడాడు. ఈ చట్టంలోని లొసుగులను సరిచేస్తామని ఆయన చెప్పుకొచ్చాడు. యూపీఏ ప్రభుత్వం చేసిన ఆనాలోచిత చట్టంలో లోపాలను సవరిస్తామని ఆయన అన్నాడు. మరి విభజన చట్టంలో మార్పులు అంటే.. అవి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయనే టెన్షన్ మొదలైందిప్పడు. ఇప్పటికే అనేక విషయాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఉప్పూనిప్పులుగా మారిపోయాయి. దానికి అనేక రీజన్లున్నాయి. మరి అలాంటి సమస్యలను పరిష్కరిస్తే పర్వాలేదు..అలాగాక ఎన్డీయే వాళ్లు విభజన చట్టంలో వేలు పెట్టి కొత్త వివాదాలను సృష్టిస్తే మాత్రం ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యతను మరింత దెబ్బతీసినవారవుతారు. కేంద్రంలో మొన్నటి వరకూ అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం తమ స్వార్థపూరిత రాజకీయాలకు అనుగుణంగానే ఏపీతో ఆడుకొందని అనడానికి సందేహించనక్కర్లేదు. మరి ఇప్పుడు మళ్లీ విభజన చట్టంలో మార్పులు అంటే.. ఇవి భారతీయ జనతా పార్టీ స్వార్థానికి ప్రతీకలు అవుతాయేమో అనే సందేహాలూ లేకపోలేదు. ఎందుకంటూ అన్నీ రాజకీయ పార్టీలే.. అందరూ రాజకీయ నేతలే. వీళ్లకు వీళ్ల పార్టీకి మైలేజీ వచ్చే రాజకీయాలే ముఖ్యం. మరి ఇప్పుడు గనుక వీళ్లు విభజన చట్టాన్ని అలాంటి ఉద్దేశాలతో కదిపితే... ఇరు రాష్ట్ర ప్రజల మధ్య వైషమ్యాలు రేగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత సామరస్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏ మాత్రం బ్యాలెన్స్ కోల్పోయినా అల్లకల్లోలమే!

మరింత సమాచారం తెలుసుకోండి: