మామూలుగానే కమలనాథులది ప్రచారం ఆర్భాటం అనే పేరు వచ్చేసిందిప్పటికే. ప్రధానమంత్రి మోడీతో సహా కమలనాథులు అంతా... ఈ విషయంలో చాలా పండిపోయారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వెనుకటికి యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కమలనాథులు ఒకరకంగా మాట్లాడి..అధికారం చేతికి అందాకా అనే విషయాల్లో యూపీఏ తీరునే కొనసాగుతుండటంతో బీజేపీ వాళ్ల తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి. నల్లధనంతో సహా అనేక అంశాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యూపీఏ-3 అనిపించుకొంటోంది. ఈ నేపథ్యంలో అక్కడక్కడ మెరుపులు మెరిపిస్తున్న మోడీ సర్కార్ ఆ అంశాలను ప్రచారం చేసుకోవడానికి మాత్రం చాలా ప్రాధాన్యతనిస్తోంది. ఈ మధ్యనే ఐక్యరాజ్యసమితి యోగాకు గుర్తింపు ను ఇచ్చింది. జూన్ 21 ని అంతర్జాతీయ యోగా డేగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇది తాము సాధించిన విజయమని కమలనాథులు చెప్పుకొంటున్నారు. ఒకరు ఇద్దరు కాదు.. అనేకమంది నేతలు ఈ విషయాన్ని చెప్పుకొంటున్నారు. ఐక్య రాజ్యసమితి యోగా డేని ప్రకటించడం మోడీ సర్కార్ సాధించిన విజయంగా వీరు చెప్పుకొంటున్నారు. అంతర్జాతీయ విధానాల్లో తాము ఎంత రైటో చూడండని వారు చెబుతున్నారు. మరి యోగా డే సంగతి ఎలా ఉన్నా... నల్లధనం వంటి అంశంపై ఎన్నికల ముందు చెప్పిన స్థాయిలో విజయంసాధించి ఉంటే.. అది బీజేపీ ఘనత అయ్యేది. దాన్ని కాస్తంత గట్టిగా చెప్పుకొన్నా ఫలితం ఉండేది!

మరింత సమాచారం తెలుసుకోండి: