తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టు నుంచి వ్యతిరేక వ్యాఖ్యలు వచ్చాయి.తెలంగాణ విధ్యార్ధులకు ఆర్దిక సాయం అనే పేరుతో ప్రభుత్వం రూపొందించిన (ఎఫ్.ఎ.ఎస్.టి) పదకాన్ని అమలు చేయరాదంటూ టిడిపి నేతలు పితాని సత్యనారాయణ,మాజీ మంత్రి డొక్కా మాణిక్ వర ప్రసాద్ లు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.పాష్ట్ పదకం వేర్పాటువాదం ప్రోత్సహించేదిగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. గతంలో కూడా వివిధ ప్రాంతాల ,రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నప్పుడు ఇలా 1956 అని కట్ ఆఫ్ పెట్టి విద్యార్ధులకు ఆర్దిక సాయం చేసే ఆలోచన ఎలా చేస్తారని హైకోర్టు గతంలో ప్రశ్నించింది.దీనిపై కౌంటర్ వేయాలని హైకోర్టు కోరింది.కాని ఇంతవరకు కౌంటర్ వేయలేదు.దీనిపై విచారణ లో ఎజి మాట్లాడుతూ ఇది కేవలం గైడ్ లైన్స్ కోసం తయారుచేసిన విషయమని, పాస్ట్ అమలులోకి రాలేదని వివరించారు.కౌంటర్ దాఖలు చేయడానికి మరోసారి అవకాశం ఇస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: