లోటు బడ్జెట్ తో మొదలైన ఆంధ్రారథాన్ని విజయవంతంగా నడిపించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ ఛాన్సు దొరికితే అక్కడ నాలుగు డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. అందులోనూ రుణమాఫీ వంటి ఘనమైన హామీలకే సర్కారు ఖజానా ఖాళీ అయ్యే పరిస్థితి ఉండటంతో ఏ చిన్న అవకాశం దొరికినా వదిలేందుకు ఆయన సిద్ధంగా లేడు. ఏళ్ల తరబడి సర్కారీ గోడౌన్లలో మిగిలిపోయిన ఎర్ర చందనాన్ని వచ్చీ రాగానే వేలం వేయంచే పని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఎంత వచ్చినా వచ్చినట్టేనంటూ ఆయన చేసిన ప్రయత్నం తొలివిడతలోనే దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు రాల్చింది.                                              ఎర్రచందనం సొమ్ము ఇచ్చిన కిక్ తో చంద్రబాబు దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఏటా ఈ వేలం టైమ్ టేబుల్ ప్రకారం జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. ఏపీలోని చిత్తూరు, కడప జిల్లాల్లో ఉన్న ఎర్ర చందనం చెట్లలో పడిపోయిన వాటిని.. ఎండిపోయిన వాటిని ఎప్పటికప్పుడు గుర్తించి.. సేకరించి.. నిల్వ చేసి.. వేలం వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అక్రమ రవాణాను సాధ్యమైనంతగా అడ్డుకుని.. ఆ ఆదాయం సర్కారుకు చేరేలా వ్యూహాలు రచిస్తున్నారు.                          ఐతే.. చంద్రబాబు ప్లాన్ కు అంతర్జాతీయ ఒప్పందాలు అడ్డుకట్టవేస్తున్నాయి. ఎర్రచందనం ప్రపంచంలోనే అత్యంత అరుదైన వృక్షజాతి. దీని అమ్మకంపై ప్రపంచ వ్యాప్తంగా ఆంక్షలున్నాయి. మొన్నటి వేలం కోసం తాత్కాలికంగా అనుమతులు తీసుకున్నా.. దీన్ని శాశ్వత పద్దతిలో నిర్వహించాలంటే మాత్రం ఆ ఒప్పందాల నుంచి ఏపీ మినహాయింపు కావాల్సిందే.. అది సాధించేందుకు కేంద్రాన్ని సంప్రదించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: