ఎపి ప్రభుత్వం జారీ చేస్తున్న రుణ విముక్తి పత్రాలకు చట్ట బద్దత ఉంటుందా అన్న ప్రశ్నతో మీడియాలో కధనాలు వస్తున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకంతో ఉన్న రుణ పత్రం కరపత్రం లా ఉందని ఒక పత్రిక వ్యాఖ్యానించింది.అది ఒకరకంగా కరపత్రం మాదిరి ఉంది తప్ప, అదికార పత్రంలా కనిపించడం లేదని అంటున్నారు.పత్రంపై ఎలాంటి అధికార ముద్రకాని, రైతు సాధికార సంస్థ అధికారి సంతకం కాని లేవని చెబుతున్నారు. అంతేకాక, తేదీ కూడా ఇందులో లేదట. చంద్రబాబు రాసిన లేఖ మాదిరి గా ఉందన చెబుతున్నారు.  దీనితో ఈ పత్రానికి ఉన్న అధికారిక విలువ ఎంత అన్నది అర్ధం కావడం లేదని అంటున్నారు.బ్యాంకులు కూడా వీటిపై ఏమీ మాట్లాడలేకపోతున్నాయి.బ్యాంకుల వద్దకు తీసుకువెళ్లి రుణాలు పునరుద్దరించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో సహా ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.ఏది ఏమైనా ప్రభుత్వం వీటిపై సందిగ్దానికి తావులేకుండా పత్రాలను రూపొందిచడమో, లేదా జారీ చేసిన పత్రాలు చెల్లే విదంగా చర్యలు తీసుకోవడమో చేస్తే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: