తెలంగాణ మంత్రివర్గంలో స్థానం దక్కించుకోనున్న సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మంగళవారం ఉదయం శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఆరు నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి మర్రి శశిధర్‌ రెడ్డిపై విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఇటీవల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సమక్షంలో తెరాసలో చేరారు. ఇటీవలే తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్షం తలసానిపై పార్టీ పిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారికి ఫిర్యాదు చేసింది. టి తెదేపా ఇచ్చిన పిర్యాదులపై వివరణ ఇవ్వాలంటూ స్పీకర్‌ నోటీసులను కూడా జారీ చేశారు. ఇదే సమయంలో శ్రీనివాస్‌ యాదవ్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. భవిష్యత్‌లో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకు వీలుగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందుగానే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని తలసాని నిర్ణయించా రు.  గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ పీఠాన్ని దక్కించుకునేందుకే తలసానికి మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్‌ ప్రతిపాదించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: