తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి వైపు వెళ్లిన వారికి మంత్రి పదవులు లభిస్తున్నాయి. ఇప్పటికే పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండి మరో ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చొనే ఓపిక లేని వాళ్లు తెరాస వైపు వెళ్లిపోయారు. మరి వారిలో ఇద్దరికి మంత్రి పదవులు ఖాయం అయ్యాయి. ఒకరు తలసాని, మరొకరు తుమ్మల. విశేషం ఏమిటంటే వీరు గత ఎన్నికల్లో ఒకరు గెలిచిన వారు, మరొకరు తెలుగుదేశం పార్టీ తరపునే పోటీ చేసి ఓడిపోయిన వాళ్లు. ఇప్పుడు ఇద్దరూ తెరాసలో చేరారు. పదవులు పొందుతున్నారు. వీరిలో తలసానికి గత ఎన్నికల్లో గెలవడం ఇప్పుడు తలనొప్పి అవుతోంది. ఎమ్మెల్యే హోదాలో పార్టీ జంప్ చేసి మంత్రి పదవిని తీసుకొంటే బావుండదని ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. దీంతో ఆయన ఇంతలోనే ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావుకు మాత్రం ఇలాంటి తలనొప్పి లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఈయన ఓటమి పాలయ్యాడు. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లాకు చెందిన ఈ నేత తెలుగుదేశం తరపున పోటీ చేసి ఓడిపోయాడు. ఈ నేపథ్యంలో తుమ్మలకు ఉప ఎన్నికల తలనొప్పి లేదు. ఎంచక్కా ఎమ్మెల్సీ పదవిని సొంతం చేసుకొని మంత్రి పదవిని బోనస్ గా అందుకొనే అదృష్టం కలిసొస్తోంది ఈయన పనే బావుంది కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: