తాలిబన్లు మరో సారి రెచ్చిపోయారు. తమను కట్టడి చేస్తున్న పాక్ సైన్యాన్ని ఏమీ చేయలేక.. వారి పిల్లలను అమానుషంగా పొట్టన పెట్టుకున్నారు. పెషావర్ లోని ఓ ఆర్మీ స్కూలుపై మానవ బాంబులు దాడి చేసి 130 మందిని పొట్టన పెట్టుకున్నారు. దాదాపు వంద మంది పిల్లలను కర్కశంగా వరుసగా నిలబెట్టి కాల్చి చంపారు. ఈ స్కూల్లో దాదాపు 500 మంది వరకూ విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది. మరో వంద మందికి పైగా పిల్లలు గాయపడినట్టు తెలుస్తోంది.                           సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పాక్ స్కూల్లో ప్రవేశించి.. నేరుగా పిల్లలపై కాల్పులకు తెగబడ్డారు. పిల్లల్లో పెద్దవాళ్లను ఎంపిక చేసుకుని మరీ కాల్పులు జరిపారని తెలుస్తోంది. ఉగ్రవాదులపై పాక్ ఆర్మీ చేసిన ఎదురు దాడిలో దాదాపు ఆరుగురు వరకూ టెర్రరిస్టులు చనిపోయారు. ఈ కాల్పులు తమ పనేనని.. తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తానీ అనే తాలిబన్ గ్రూపు ప్రకటించింది.                            ఈ దారుణం విషయం తెలియగానే ఖంచించిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ హుటాహుటిన పెషావర్ చేరుకున్నారు. మిలటరీ రెస్క్యూ ఆపరేషన్ ను సమీక్షించారు. ఈ దారుణంపై ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. తాలిబన్ల కర్కశత్వంపై స్పందించిన మోడీ.. తాలిబన్ల ఘాతుకాన్ని పిరికిపందల చర్యగా వర్ణించారు. పాకిస్తాన్ ఇకనైనా ఉగ్రవాదులకు షెల్టర్ ఇవ్వడం మానుకోవాలన్నారు. అమాయకులైన పిల్లలను చంపడం ద్వారా తాలిబన్లు ఏం సాధించారని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: