గత ప్రభుత్వంలో చక్రం తిప్పంది సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు. ప్రధానమంత్రి బాధ్యతల్లో ఉన్న మన్మోహన్ పేరుకు మాత్రమే పనిచేశారు. మన్మోహన్ ను రోబోగా చేసుకొని సోనియాగాంధీ వ్యవహారాలను సమీక్షించిందనే పేరు ఎలాగూ ఉండనే ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో గత ప్రభుత్వ వ్యవహారాల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు రిలీఫ్ లభిస్తుండగా... యాక్టింగ్ పీఎంగా వ్యవహరించిన మన్మోహన్ కు మాత్రం తలనొప్పి తప్పేలా లేదు! నేషనల్ హెరాల్డ్ పత్రిక వ్యవహారంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి, ఆమె తనయుడు రాహుల్ గాంధీలకు కోర్టు మరింత రిలీఫ్ ను ఇచ్చింది. వారి విచారణకు కోర్టుకు హాజరయ్యే విషయంలో స్టే కొనసాగుతోంది. ఢిల్లీ హై కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. దీంతో సోనియాగాంధీ, రాహుల్ లను బోనులో నిలపాలన్న బీజేపీ నేత స్వామి ప్రతిన నెరవేరే అవకాశం కనపడటంలేదు. మరోవైపు బొగ్గు స్కామ్ లో మన్మోహన్ ను సీబీఐ ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూపీఏ హయాంలోనే కోల్ స్కామ్ గురించి విచారణ మొదలైంది. అయితే ఇప్పటి వరకూ అది ఎటూ తెమలలేదు. గత ప్రభుత్వ హయాంలో మన్మోహన్ ను ప్రశ్నించకుండానే సీబీఐ విచారణ కొనసాగింది. అయితే ఇప్పుడు మాత్రం మన్మోహన్ ను ప్రశ్నించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. మరి కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీకి న్యాయస్థానాల్లో రిలీఫ్ లభిస్తోంది. యాక్టింగ్ పీఎంకు మాత్రం న్యాయస్థానాల నుంచి, విచారణ సంస్థల నుంచి ఇబ్బంది తప్పడం లేదు! ----

మరింత సమాచారం తెలుసుకోండి: