గురువారం నుంచి ఆంధ్రా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 18 నుంచి 23 వరకూ సమావేశాలు జరపాలని నిర్ణయించారు. రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి బిల్లుతో పాటు మరికొన్నిబిల్లులు ప్రవేశపెట్టబోతున్నారు. రాజధాని భూసమీకరణ, రుణమాఫీ, డ్వాక్రా రుణాలు, ఫించన్ మరణాలు, రైతుల ఆత్మహత్యలు వంటి అంశాలపై ప్రతిపక్షం దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది. అందుకే స్వల్పకాలిక సమావేశాలైనా.. జగన్ ను కట్టడి చేసేందుకు టీడీపీ పక్కా ప్లాన్ రూపొందించింది.                               విపక్షానికి అవకాశం ఇవ్వకుండా.. ప్రభుత్వం తరపున ప్రకటనలు చేయించడం.. వాటిపైనే చర్చ జరిగేలా చూడటం అందులో ఒకటి. ముఖ్యంగా.. సీఎం చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల్లో రోజుకో ప్రకటన చొప్పున ఐదు ప్రకటనలతో అసెంబ్లీ సమయాన్ని పూర్తిగా తామే వినియోగించుకోవాలని ప్లాన్ వేస్తున్నారు. దీని ద్వారా విపక్షానికి మాట్లాడే ఛాన్సు అతి తక్కువగా ఉంటుంది. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా ఉంటుందని ఆలోచిస్తున్నారు. దీనిపై ప్రత్యేకంగా కసరత్తు జరిపి.. ఎవరు ఏ ఏ అంశాలపై ప్రకటనలు చేయాలన్నదానిపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్టు తెలిసింది.                        మరోవైపు.. ప్రతిపక్షనేత జగన్ లక్ష్యంగా ఎదురుదాడి చేయాలని కూడా టీడీపీ ప్లాన్ చేస్తోంది. మొన్నటికి మొన్న జగన్ ఆస్తులు జప్తు చేసిన నేపథ్యంలో.. జగన్ ను దోషిలా సభ ముందు నిలబెట్టాలని పసుపు దళం భావిస్తోంది. రుణమాఫీపై జగన్ నిలదీసినా.. అసలు మాఫీ అమలు చేయలేరని ఆయన ఎన్నికలకు ముందు చెప్పిన విషయాలు ప్రస్తావిస్తూ ఎదురుదాడికి సిద్ధమవుతున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లలో వైఎస్సార్ సీపీకి ఉన్న సంబంధాలు కూడా ప్రస్తావనకు తీసుకురావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ కు దాడి చేసే అవకాశం ఇవ్వకుండా.. ముందే ఎదురుదాడి చేసి కట్టడి చేయాలన్న టీడీపీ వ్యూహం ఎంతవరకూ ఫలిస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: