రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు షురూ కానున్నాయి. కేవలం ఆరురోజుల పాటు మాత్రమే సభ జరగనున్నప్పటికీ... ఈ సమావేశాలు వాడీవేడీగా ఉంటాయని మాత్రం చెప్పవచ్చు. సభ సమావేశాల నేపథ్యంలో అటు ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు మంత్రులు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించాడు. సభలో నిర్వహించాల్సిన వ్యూహం గురించి చర్చించాడు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్లు కూడా సమావేశం అవుతున్నారు. సభలో ప్రభుత్వాన్ని ఇరుకున పడేయడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని వారు సిద్ధం చేసుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి సమావేశాల్లో ఏ పక్షానిది పై చేయిగా నిలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది! ఎన్నికల తర్వాత ఇప్పటికే రెండు దఫాలుగా సభాసమావేశాలు జరగగా.. రెండు పార్టీ లమధ్య రచ్చ యమ రంజుగా కనిపించింది. రెండు పార్టీలూ ఢీ అంటే ఢీ అన్నట్టుగానే పోరాడాయి. వ్యక్తిగత విమర్శల విషయంలో నైనా, విధాపరమైనవిమర్శల్లోనైనా ఎవరూ తగ్గలేదు. మరి మళ్లీ సభాసమావేశాల నేపథ్యంలో ఈ సారి రచ్చ ఏ విధంగా ఉంటుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: