భారతీయ సంతతికి చెందిన అమిరేష్ బాబులాల్ ‘అమీ’ బెరా, అమెరికా ప్రతినిధుల సభలో ఏకైక భారతీయ సంతతికి చెందిన సభ్యుడు గా ఎన్నికైనాడు. మధ్యంతర ఎన్నికల్లో కాలిఫోర్నియా నుంచి పోటీ చేసిన అమీ బెరా తొలుత తన ప్రత్యర్థి రిపబ్లిక్ పార్టీకి చెందిన డౌగ్ ఓసే కంటే 3వేల ఓట్లు వెనుకబడ్డారు. మిగిలిన ఓట్లన్నీ లెక్కించేసరికి అమీ బెరా 1,455 ఓట్ల ఆధిక్యం సాధించారు. 2012లో కూడా భారతీయ సంతతికి చెందిన అమీ బెరా గెలిచిన విషయం అందరికీ విదితమే. యూఎస్ చట్టసభకు ఎన్నికైన మూడో ఇండియన్ అమెరికన్‑గా అమీబెరా చరిత్ర సృష్టించారు. ఇంతకుముందు బాబీ జిందాల్, దలిప్ సింగ్ సంద్‑లు ఎన్నికయ్యారు. ఎంతో ఉత్కంతభారితంగా జరిగిన ఈ ఎన్నికలలో కుడా అమీ బెరా మరోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ మధ్యంతర ఎన్నికలు గత నెల నవంబర్ 4, 2014 న జరిగిన సంగతి తెలిసిందే. యూఎస్ చట్టసభకు మరోసారి ఎన్నికైన ఇండియన్ అమెరికన్ అమీ బెరాకు తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో (టి ఎ జీ ఎస్) శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు టి ఎ జీ ఎస్ ఛైర్మన్ వాసు కుడుపూడి, ప్రెసిడెంట్ వెంకట్ నాగం, కార్యనిర్వహక బృంద సభ్యులు అబ్దుల్ షైక్, దుర్గ చింతల, మనోహన్ మందాడి, గిరిధర్ టాటిపిగారి, శ్రీదేవి మాగంటి, రాజా రామ్ ముమ్మడవరపు, వనిత ఆలపాటి, మోహన్ కాట్రగడ్డ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. 2012లో అమీబెరా యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటీవ్స్‑కు మొదటి సారి ఎన్నికయ్యారు. స్థానిక భారతీయ సంఘాలు శాక్రమెంటో శివారు నగరం కార్ మైఖేల్ లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమం లో అమీ బేరా ను కలసిన టి ఎ జీ ఎస్ ప్రతినిధులు వాసు కుడుపూడి, వెంకట్ నాగం, మనోహన్ మందాడి, దుర్గ చింతల మరియు భారతీయ సంతతిని ఉద్దేశించి అమీ బేరా మాట్లాడుతూ, 1958 లో వారి తండ్రి గుజరాత్ ప్రాంతం రాజ్ కోట్ నుండి అమెరికా కు తరలి వచ్చింది అని, 1960 లలో తోటి భారతీయ కుటుంబాన్ని కలవాలంటే కాలిఫోర్నియా లో 45 నిమిషాలు కారులో ప్రయాణం చేయవలసి వచ్చేదని పేర్కొన్నారు. అయితే తదుపరి భారతీయ కుటుంబాలు గణనీయ సంఖ్యలో కాలిఫోర్నియా లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాయి అని సంతోషం వ్యక్తం చేసారు. శాక్రమెంటో పరిసర ప్రాంతాల అభివృద్ధి, అమెరికా రాజధాని వాషింగ్టన్ (డి సి) తో సత్సంబంధాలు నెలకొల్పడం తన తక్షణ కర్తవ్యాలు అని అమీ బేరా తెలిపారు. “డిసెంబర్ 13, 2014 ఫోటో : అమీ బేరా ను కలసిన టి ఎ జీ ఎస్ ప్రతినిధులు: (ఎడమ నుండి కుడి) దుర్గ చింతల, వాసు కుడుపూడి, అమీ బేరా, వెంకట్ నాగం”యూఎస్ చట్టసభకు ఎన్నికైన అమీ బెరా పలు దశాబ్దాలుగా గ్రేటర్ శాక్రమెంటో పరిధిలో నివసిస్థున్న భారతీయ సంతతి కి చెందిన వారు అని టి ఎ జీ ఎస్ ప్రతినిధులు ఈ సందర్భం గా గుర్తు చేశారు. ఆయనతో పని చేస్తూ ఇండో అమెరికన్ సంబంధాలను కొత్త పుంతలు తొక్కిస్తామని వారు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: