మైక్రోసాఫ్ట్ డివెసైస్ సంస్థ విండోస్ ఓఎస్‌పై లభ్యమయ్యే అత్యంత చౌక 4జీ స్మార్ట్‌ఫోన్, లూమియా 638ను మార్కెట్లోకి తెచ్చింది.విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్ ధర రూ.8,299. ఈ ఫోన్‌లో 4.5 అంగుళాల స్క్రీన్, 1.2 గిగా హెర్ట్స్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 5 మెగా పిక్సెల్ కెమెరా, 8 జీబీ మెమెరీ, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 1,830 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. వీడియో కంటెంట్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా వీక్షించే వారి కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తున్నామని నోకియా ఇండియా సేల్స్ డెరైక్టర్ (మార్కెటింగ్) రఘువేశ్ సరూప్ చెప్పారు. లూమియా రేంజ్ ఫోన్లలో అందుబాటు ధరల్లోనే అత్యున్నత ఫీచర్లున్న స్మార్ట్‌ఫోన్లను విక్రయిస్తున్నామని పేర్కొన్నారు. అమెజాన్‌డాట్‌ఇన్‌లో కొత్తగా అందిస్తున్న మైక్రోసాఫ్ట్ బ్రాండ్ స్టోర్‌లో కంపెనీ ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: