పెషావర్ లో ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండ కూడా పాకిస్తాన్ గతినిమార్చలేకపోతోంది. అక్కడి రాజకీయ నేతల బుద్ధిని ఇలాంటి విషాదకాండ కూడా ప్రభావితం చేయలేకపోతోంది. ఉగ్రవాదులను పెంచి ఫోషించిన పాలకులే ఇప్పుడు.. మళ్లీ ఇండియాను బూచిగా చూపించి లబ్ధి పొందుదామని అనుకొంటున్నారు. పాకిస్తాన్ లో ఉగ్రవాదులు బాగా వృద్ధి చెందింది ముషార్రఫ్ పాలనలోనే. ఈ సైనియ నియంత అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాద సంస్థలకు కావాల్సినన్ని నిధులు వెళ్లాయి. అనేక మంది యువకులు ఉగ్రవాదులగా మారిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా అశాంతిని సృష్టించే శక్తి సమకూరింది అప్పట్లోనే. అయితే క్రమంగా పెరిగి పెద్దదైన ఆ ఉగ్రవాద భూతం ఇప్పుడు పాక్ నే ముప్పుతిప్పలు పెడుతోంది. మరి ఇప్పిటకైనా పాక్ పాలకుల్లో కొంత ప్రాయుశ్చిత్యం కనిపిస్తుందని ఆశించిన వారి కి అడియాసలే మిగులున్నాయి. పెషావర్ లో విలయం సృష్టించిన ఉగ్రవాదులకు శిక్షణను ఇచ్చింది భారతదేశమే అని అంటున్నాడు పాకిస్తాన్ మాజీ నియంత ముషార్రఫ్. ఈ మేరకు ఆయన అంతర్జాతీయ మీడియాతో తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి బొంకుతున్నాడు. భారత నిఘా సంస్థ రా ఆధ్వర్యంలో తాలిబన్లకు శిక్షణ అందుతోందని ఆయన ఆరోపిస్తున్నాడు. మరి ముషార్రఫ్ మాటల్లో నిజానిజాలు ఎన్ని ఉన్నాయో అనే ఆలోచించడం కూడా వృధా. ఇలాంటి వాళ్లు పాక్ లో ప్రముఖులుగా చెలామణి అవుతుంటే.. పాలకులు అయితే.. ఆ దేశం ఇలా రక్తపు మడుగులో కొట్టుకొని చావక తప్పదు!

మరింత సమాచారం తెలుసుకోండి: