తిరుపతి తెలుగుదెశం పార్టీ ఎమ్మెల్యే వెంకటరమణ మృతి బాధాకరమని, ఆయన కోరిక మేరకు సింగపూర్‌లో వైద్యం చేయించి ఉంటే బతికేవారని వైసీపీ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ గురువారం శాసన సభలో అన్నారు. వెంకటరమణ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఆయన కిందిస్థాయి నుండి ఎదిగిన వ్యక్తి అన్నారు. తిరుపతి ప్రజలకు, తెలుగుదెశం నికి తీరనిలోటు అన్నారు. సహనానికి మారుపేరు వెంకటరమణ అన్నారు. ఆయన 30వేలకు పైగా మెజార్టీతో గెలిచారంటే ఆయన ఎలాంటి వ్యక్తో అర్థం చేసుకోవచ్చన్నారు. అనంతరం జగన్ తనకు మైక్ ఇవ్వలేదని ఆరోపించారు. మాట్లాడాలని తనను కోరలేదని ఆవేదన వ్యక్తే చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలి సభాపతి మీరేనని, సంప్రదాయాలు పాటించాలని కోడెల శివప్రసాద రావును ఉద్దేశించి అన్నారు. అధికారంలో ఉన్నామని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించకూడదన్నారు.ప్రతిపక్షాన్నికించపరిచేలావ్యవహరించవద్దన్నారు.  ప్రతిపక్ష నేతగా సంతాపం తెలిపే హక్కు తనకు లేదా అన్నారు. వెంకటరమణ మృతి బాధాకరమన్నారు. వైయస్ నాయకత్వంలో ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారన్నారు. ఈ సందర్భంగా సమావేశాల పొడిగింపునకు విపక్షం పట్టుబట్టింది. కేవలం ఐదు రోజుల పాటు జరిగే సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించేందుకు అవకాశం ఎక్కడుందని విపక్షం తరపున భేటీకి హాజరైన జ్యోతుల నెహ్రూ, శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. అయితే, వివిధ కారణాల రీత్యా సమావేశాల పొడిగింపు ఎంతమాత్రం కుదరదని ప్రభుత్వం చెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: