మంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ జ్యోతిష్యుడ్ని కలవడంపై రాద్ధాంతం చేసిన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పై దాడికి కాషాయం పార్టీ తన అంబుల పొదలో నుంచి సరికొత్త ఆయుధాన్ని వెలికి తీసింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కోసం ఆయన తాత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు జాతక చక్రం వేయించాలని తన సోదరి కృష్ణ హతిసింగ్ కి 1944, ఆగస్టు 29వ తేదీన రాసిన లేఖను బీజేపీ బుధవారం వెలుగులోకి తీసుకువచ్చింది. ఇదే అంశంపై నెహ్రు తన కుమార్తె ఇందిరకు కూడా లేఖ రాశారని బీజేపీ పేర్కొంది. కాగా నవంబర్ 25వ తేదీన స్మృతి ఇరానీ తన భర్తతో కలిసి రాజస్థాన్ లోని భిల్వారాలో జ్యోతిష్కుడిని కలిశారు. ఈ సందర్భంగా ఆ జ్యోతిష్కుడు స్మృతి భవిష్యత్తులో దేశానికి అధ్యక్షురాలు అవుతారని చెప్పారని కథనాలు వెలువడ్డాయి. స్మృతి ...జ్యోడిష్యుడిని కలవటంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజీవ్ జాతకంపై బీజేపీ ఎదురు దాడికి దిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: