అసెంబ్లీ సమావేశాల వేళ జగన్ కు చేతినిండా పని. ప్రతిపక్షనేతగా ప్రభుత్వాన్ని ఎలా ఇరుకునపెట్టాలి.. ఏ ఏ అంశాలపై చర్చించాలి. ఏ ఏ ఇష్యూ ఏ ఎమ్మెల్యేకు అప్పగించాలి. ప్రజాసమస్యలను ఎలా సభలో హైలెట్ చేయాలి.. ఇలాంటి వ్యూహమథనాల్లో ప్రతిపక్షనేతకు తీరక ఉండదు. ఐతే అసెంబ్లీ సమావేశాలప్పుడు ఈ బిజీ అందరు నేతలకూ ఉంటుంది. కానీ.. జగన్ కు వీటితో పాటు అదనంగా మరో పని కూడా ఉంది.                                   జగన్ కు ఉన్న ఆ పనేంటంటే.. కోర్టు కేసులకు హాజరుకావడం.. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు.. మరోవైపు కోర్టు వాయిదాలు.. రెండిటి మధ్య జగన్ నలిగిపోతున్నాడు. హైకోర్టు, అసెంబ్లీ రెండూ హైదరాబాద్ లోనే ఉన్నా.. ఒకే సమయంలో రెండింటినీ మేనేజ్ చేయడం కష్టమైన పనే.. అందుకే అసెంబ్లీ ఉన్నన్నాళ్లూ... వాయిదాలను హాజరుకాలేనంటూ జగన్ కోర్టుకు మొరపెట్టుకున్నాడు.                      పాపం.. జగన్ ఇబ్బందిని కోర్టు కూడా బాగానే అర్థం చేసుకుంది. వాస్తవానికి అక్రమాస్తులకు సంబంధించిన పది కేసుల్లోనూ జగన్ శుక్రవారం న్యాయస్థానానికి హాజరు కావాల్సి ఉంది. అసెంబ్లీసమావేశాల నేపథ్యంలో తనకు మినహాయింపు ఇవ్వాలన్న జగన్ అభ్యర్థనను కోర్టు మన్నించింది. ఐతే.. ఇందు-గృహనిర్మాణమండలి ఒప్పంద అక్రమాల కేసులో మాత్రం జగన్ హాజరుకాకతప్పేటట్టు లేదు. ఎందుకంటే.. ఈ కేసు మొదటిసారి జగన్ హాజరు కాబోతున్నందువల్ల మినహాయింపు లభించడం కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: