ఆంధ్రా కొత్త రాజధానికి సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. అసెంబ్లీలో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ఏర్పాటు కోసం బిల్లు ప్రవేశపెడుతున్నారు. మరోవైపు భూసమీకరణ విధానంపై ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసింది. ప్రభుత్వ ప్రకటనపై రైతుల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో రైతులు.. తమ నిరసనను వింత పద్దతుల్లో తెలుపుతున్నారు.                                         గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని రైతులు తమ అభిప్రాయాలను బోర్డు రూపంలో ఏర్పాటు చేసి ప్రదర్శిస్తున్నారు. గ్రామాల పొలిమేరల్లో.. ల్యాండ్ పూలింగ్ కు మా భూములు ఇవ్వలేం అంటూ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.. స్వాగతం.. సుస్వాగతం.. అని చెబుతూనే.. భూములివ్వలేం..మాకు సహకరించండంటూ అధికారులు, నాయకులు, కమిటీ మెంబర్స్ కు బోర్డు ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.                           తమ గ్రామాల్లో పలు రకాల పంటలు పండుతాయని.. మూడు పంటలు పండే భూములని ఆ బోర్డుల్లో తెలుపుతున్నారు. అంతేకాదు.. ఇక్కడంతా చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఉన్నామని రాస్తున్నారు. సిటీకి అతి సమీపంగా ఉన్నందువల్ల అపార్ట్ మెంట్లకూ, ఫ్లాట్లకూ అన్ని విధాలా అనుకూలమైన భూమి అయినందువల్ల ఈ భూములు ప్రభుత్వానికి ఇవ్వలేమని వారు చెబుతున్నారు. మరి వీరి విజ్ఞప్తులు ప్రభుత్వం వరకూ వెళ్తాయా.. వీరి మొర ప్రభుత్వ పెద్దలు ఆలకిస్తారా..?

మరింత సమాచారం తెలుసుకోండి: