ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రుణాల మాఫీ అమలును శాసన సభలో ప్రధాన అస్త్రంగా చేసుకునేందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రంగం సిద్ధం చేస్తోంది. అన్ని అర్హతలు ఉన్నా రుణ మాఫీ చేయకుండా అనర్హులు కింద, పెండిం గ్‌లో ఉంచడాన్ని ప్రస్తావిస్తూ అధికార తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేలా వ్యూహాత్మ కంగా వ్యవహరించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. మొక్కుబడిగా అమలు జరగడంతో రుణ మాఫీ అమలు జరుగుతున్న తీరుపై శాసనసభలో అధికారపక్షంపై అన్ని వైపుల నుండి దాడి చేసేందుకు సంసిద్ధమవుతున్నట్లు తెలియవచ్చింది. రుణ మాఫీపై ఇటీవల రాష్టవ్య్రాప్తంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఆందోళనలు సైతం చేసింది. ప్రస్తుతం శాసనసభా సమావేశాలు ప్రారంభం కావడంతో దీన్ని తమ వేదికగా చేసుకునేందుకు పావులు కదుపుతోంది. వ్యవ సాయ రుణాలు, పంట నిమత్తం బంగారు పెట్టి తెచ్చిన రుణాలు, డ్వాక్రా గ్రూపులకు సం బంధించిన రుణాలను మాఫీ చేసే విషయంలో చంద్రబాబునాయుడి ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందనే అభిప్రాయంతో ఉన్న వైఎస్సార్‌ సీపీఇదే తమ ప్రధాన ఎజెండా ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అడ్డగోలు కోత విధానాలతో రుణ మాఫీ చేయకుండా రైతులను ఇబ్బందుల పాల్చేస్తున్న విషయంపై శాసనసభలో గట్టిగా తమ వాణిని వినిపించాలని నిర్ణయించింది.  తొలి దశలో 20 శాతం చొప్పున రుణ మాఫీ చేసినట్లు ప్రకటించినా అది గందరగోళంగా చేశారనే అభిప్రాయం ఆ పార్టీ ఎమ్మెల్యేలలో వ్యక్తమవుతోంది. అర్హత ఉన్నా మాఫీ చేయకుండా రైతుల నెత్తిన శఠగోపం పెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందనే విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి. ధృవపత్రాలు అన్నీ ఉండి, మాఫీకి అర్హత సాధించినా వ్యవసాయ, బంగారు రుణాలను రద్దు చేయకుండా పెండింగ్‌లో పెట్టడం పట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నారు. కాగా మొదటి, రెండవ విడత మాఫీ జాబితాలను విడుదల చేసిన ప్రభుత్వం వాటిపై అభ్యంతరాలు, అనుమానాల నివృత్తికి ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్లు కూడా అందుబాటులో లేకుండా పోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రైతుల నుండి వచ్చే అనుమానాలు, ఫిర్యాదుల నిమిత్తం టోల్‌ ఫ్రీ నెంబర్లు అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వం ప్రకటించినా, అవి గంటల తరబడి బిజీయే తప్ప రైతులకు మాట్లాడే అవకాశం లభించడం లేదు. 24 గంటలూ లైన్‌ బిజీ అనే సమాధానం తప్ప మరే అవకాశం కలుగడం లేదని అంటున్నారు. ఒక వేళ రింగ్‌ అయితే కాల్‌ను లిఫ్ట్‌ చేయకుండా బిజీ మోడ్‌కు మార్చడంతో టోల్‌ ఫ్రి నెంబర్లతో మాట్లాడిన రైతులు నూటికో కోటికో ఒక్కరు అనేవిధంగా తయారైంది. అలాగే పెండింగ్‌లో ఉన్న రుణాల విషయంలో మీ సేవా కేంద్రాలు, రైతు సాధికారిత సదస్సులు, జన్మభూమి గ్రామ సభల్లో పెండింగ్‌కు సంబంధించిన ధృవపత్రాలు సమర్పించవచ్చని ప్రభుత్వం ప్రకటించినా అందుకు వారు నిరాకరిస్తుండడంతో దీనిపై రైతాంగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. విఆర్‌వోలు, మీ సేవా కేంద్రాల నిర్వాహకులు పెండింగ్‌లో పెట్టిన రుణాలకు సంబంధించిన ధృవపత్రాలను తీసుకునేందుకు తిరస్కరిస్తున్నారు. కాగా ఆన్‌లైన్‌లో ఉంచిన రుణాల జాబితాను చూసుకునేందుకు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, లోన్‌ నెంబర్‌ వంటి వివరాలను నమోదు చేస్తే 80 శాతం రైతులకు సంబంధిచి ఆధార్‌కార్డు చెల్లుబాటులో లేదనే రిమార్కు పెట్టి వాటిని పెండింగ్‌లో ఉంచిన సంఘటనలే ఉన్నాయి. ఆధార్‌ నెంబర్‌ను నమోదు చేస్తే సంబంధిత రైతుల వివరాలన్నీ ఉన్నా ఆధార్‌ చెల్లుబాటు కాదని పెండింగ్‌లో పెట్టడంపై ప్రభుత్వ ఉద్దేశ్యం ఎగవేసేందుకేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: