ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే జూన్‌ నాటికి రాష్ట్రంలో సు మిటోమో విధానంలో వ్యవసాయం మొదలవబోతున్నది.వ్యవసాయ రంగంలో రాష్ర్టంలో కొత్త శకానికి నాంది పలకటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు జపాన్‌ లోని సుమిటోమో కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నది. ఈఒప్పందాలవల్ల రాష్ట్ర వ్యవసాయరంగంలో సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టినట్లైంది. సుమిటోమో కంపెనీ సహకారంతో కొత్తసేధ్యపు యంత్రసామగ్రి, ఆధునికవిధానాలను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.గురువారం సచివాలయంలో సుమిటోమో కంపెనీ సీఈఒ కె. హిరావో నేతృత్వంలోని 11 మంది ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. రాష్ర్టంలోని రైతాంగానికి ఆధునిక సేధ్యపు విధానాలను పరిచయం చేయటానికి వచ్చే జూన్‌ నాటికి అన్ని ంటినీ సిద్దం చేయాలని చంద్రబాబు ప్రతినిధి బృందాన్ని కోరారు. ఇక్రిశాట్‌తో కలిసి పనిచేసి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే బృహత్తర కార్యక్రమంలో భాగ స్వాములు కావాలని చంద్రబాబు కోరారు. రైతులకు కేవలం సాంకేతిక పరిజ్ణా నాన్ని అందించటమే కాకుండా వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కె టింగ్‌ కల్పించే విషయాల్లో కూడా రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. ఒక్క వరి పంట మీద మాత్రమే రైతులు ఆధారపడకుండా మామిడి, జీడిమామి డి, అరటిలాంటి ఉద్యాన పంటలపై కూడా సహకరించాల్సిందిగా చెప్పారు. జప నీస్‌ నర్సరీ మేనేజ్‌మెంట్‌, ఇంటిగ్రేటెడ్‌ పెస్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటిగ్రేటెడ్‌ న్యూట్రి యంట్స్‌ మేనేజ్‌మెంట్‌ తదితర విధానాలపై సుమిటోమో బృందం ముఖ్యమం త్రికి వివరించింది. రాష్ట్రంలోని వ్యవసాయ శాస్త్రవేత్తలు,అధికారులు, రైతులకు ఆధునిక సౌకర్యాలపై అవగాహన కల్పించాలన్నారు. ఆహార శుద్ది పరిశ్రమ రం గంలో జపాన్‌ పద్దతుల్ని ఇక్కడ సులభంగా అమలు చేయవచ్చని ప్రతినిధి బృం దం తెలిపింది. వరి, మొక్కజొన్న, ఆయిల్‌పామ్‌ తదితరాలకు సంబంధించి ఫు డ్‌ ప్రాసెసింగ్‌ పద్దతుల్ని ఇక్కడ ప్రవేశపెట్టాల్సిందిగా చంద్రబాబు విజ్ణప్తిచేశారు. జైకా సహకారంతో సుమిటోమో కార్పొరేషన్‌ శ్రీకాకుళం జిల్లాలో చేపట్టబోయే బొగ్గు ఆధారిత ఇంధన పరిశ్రమ పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు చ ర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి బృందాన్ని కోరారు. రాష్ట్రంలో ఇది తొలి ఎకో ఫ్రెండ్లీ పవర్‌ ప్రాజెక్ట్‌గా సిఎం వర్ణించారు. పురపాలక శాఖ మంత్రి పి.నారాయ ణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌,ఇంధనశాఖ కార్యదర్శి అజయ్‌జైన్‌, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జెఎస్వీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: