విశాఖలో వచ్చిన హుధుద్ తుఫాను పైన వైసీపీ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఏపీ ప్రభుత్వానికి పలు సూటి ప్రశ్నలు వేశారు. ఆయన శుక్రవారం శాసన సభలో మాట్లాడారు. తాను ప్రభుత్వాన్ని సూటి ప్రశ్నలు అడుగుతున్నానని పదేపదే చెబుతూ పలు ప్రశ్నలు అడిగారు. నేను అడిగేవి వాస్తవం అవునా కాదా చెప్పండి అంతే అన్నారు. ఈ రోజు హుధుద్ తుఫాను పైన చర్చ జరుగుతుంటే సీఎం చంద్రబాబు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ వచ్చారని విశాఖ వెళ్లారని, కానీ అది ఎప్పుడో ఖరారైందని, అలాంటప్పుడు శాసన సభ సమావేశాల తేదీలను ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు.  కేంద్రాన్ని శాసన సభ సాయం అడగాలని తీర్మానం చేయాలన్నప్పుడు చంద్రబాబు ఎక్కడికో ఎందుకు వెళ్లారన్నారు. హుధుద్ తుఫాను వల్ల డెబ్బైవేల కోట్ల నష్టమో, ఇంకేంతోనని ఈనాడు పత్రికలో వచ్చిందని, ఇలా నష్టం వేల కోట్లలో ఉంటే ప్రభుత్వం వన్ పర్సెంట్ మాత్రమే ఖర్చు పెట్టిందని, ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఎందుకన్నారు. తుఫాను వల్ల 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, మూడు వేల కోట్ల నష్టం జరిగిందని, దమ్మిడి అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: