ప్రత్యేకించి రాజధాని విషయంలో తనే అల్టిమేట్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు తెలుగుదేశం అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ విషయంలో ఆయన విజనేంటో ఎవరికీ అంతుబట్టడం లేదు కానీ.. ఎవరేం చెప్పినా ఆయన వినడం లేదు.తనకు మించిన మేధావి లేడని బాబు భావిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రాజధాని నిర్మాణం గురించి శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేయడమే కాకుండా.. పచ్చని పొలాల్లో రాజధాని ఏమిటి? అని ప్రశ్నిస్తున్న వారిని కూడా బాబు ఖాతరు చేయడం లేదు. ఈ విషయంలో మరో అడుగు ముందుకేసి.. రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో భూ అమ్మకోలు, కొనుగోలుపై నిషేధం విధిస్తూ ఏకంగా జీవోను కూడా ఇచ్చేసింది ఏపీ ప్రభుత్వం. ఇదంతా బాబు గాని నిర్ణయానుసారం జరిగినది అని చెప్పడానికి సందేహించనక్కర్లేదు. ఎవరి ఇష్టాను సారం వారు భూములను అమ్ముకోవడం, కొనుక్కోవడం జరగకూడదు.. అన్నీ తన కన్నుసన్నల్లోనే జరగాలన్న భావనతో ఏపీ ముఖ్యమంత్రి వర్యులు ఇలాంటి ఆదేశాలను ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే కోర్టులు మాత్రం ఈ తరహా నియంతృత్వానికి ఒప్పుకోవడం లేదు. రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో భూముల కొనుగోలు.. అమ్మకాలకు ఎలాంటి బ్రేకులూ వేయడానికి వీలు లేదని.. ఈ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు చెల్లవని స్పష్టం చేసింది. ఈ విధంగా ఏపీ ముఖ్యమంత్రి నియంతృత్వ తరహా నిర్ణయం కోర్టుల ముందు వీగిపోయింది!

మరింత సమాచారం తెలుసుకోండి: