ఆంధ్రాలో సంక్రాంతి వచ్చిందంటే చాలు సందడే..సందడి.. అందుకే దీన్ని పెద్ద పండుగగా పిలుచుకుంటారు. మరి ఈరోజుల్లో పండుగ అంటే మాటలా.. నిత్యావసరాల ధరలు చుక్కలనంటున్నతున్న నేపథ్యంలో పిండివంట జోలికి వెళ్లాలంటేనే గృహిణులు భయపడిపోతున్నారు. అలాంటి వారి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించబోతున్నారు. పిండివంటలకు అవసరమైన దాదాపు 5 రకాల సరుకులను అందివ్వాలని ప్లాన్ చేస్తున్నారు.                                         మార్కెట్లో దాదాపు రూ. 250లకు లభించే సరుకులను కేవలం 100 రూపాయలకు అందిస్తే ఎలా ఉంటుందని బాబు ప్లాన్ చేస్తున్నారు. దీనికి ఎన్టీర్ సంక్రాంతి శోభ, ఎన్టీఆర్ సంక్రాంతి విందు అనే తరహా పేర్లు ఆలోచిస్తున్నారట. ఐతే ఈ అవకాశం అందరికీ కాదు సుమా. కేవలం తెల్లకార్డు వినియోగదారులకు మాత్రమే. దీంతో పాటు గ్యాస్ పైవ్యాట్ భారాన్ని కూడా తగ్గిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. సంక్రాంతికి అన్ని ఇళ్లలోనూ పిండివంటల ఘుమఘుమలు ఖాయం.                       సరుకుల్లో సగం ధర రాయితీగా ఇస్తే.. దాదాపు 100 కోట్లు భారం పడే అవకాశం ఉంది. దీంతో మరికొందరు మంత్రులు మాత్రం.. ఎలాగూ ఇస్తున్నాం కదా.. ఇచ్చేదేదో పూర్తి రాయితీతో ఫ్రీగా ఇచ్చేద్దాం అంటున్నారట. ఈ విషయంపై పౌరసరఫరా అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. సగంధరకో.. ఫ్రీగానో.. ఏదో రకంగా ఈసారి పిండివంటల కోసం ప్రభుత్వం సరుకులు ఇవ్వబోతోందన్నమాట.   

మరింత సమాచారం తెలుసుకోండి: