జగన్‌ ఆస్తుల కేసులో సీబీఐ ఇటీవల దాఖలు చేసిన 11వ ఛార్జి షీట్‌పై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేప ట్టింది. గురువారం విచారణకు హాజరుకావాలం టూ సీబీఐ తమ ఛార్జిషీట్‌లో నిందితులుగా పేర్కొ న్నవారందరికీ సమన్లు జారీ చేసింది. జగన్‌ అసెం బ్లిలో ఉండడంతో.. కోర్టుకు గైర్హాజరయ్యారు. కేసు ను వచ్చేనెల 29కి వాయిదా వేసిన కోర్టు.. ఆ రోజు జగన్‌ హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసులో నింది తులుగా ఉన్న ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, మాజీ మంత్రు లు ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ, గీతారెడ్డి తదితరులు శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. అసెంబ్లి  సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్నందున జగన్‌ తన తరఫు న్యాయవాదులను పంపారు. దీంతో సీబీఐ కోర్టు జగన్‌ కోర్టుకు రావాలని పేర్కొంది. సమన్లు జారీ అయిన తొలిసారి కోర్టుకు హాజరు కావాలని జగన్‌ తరఫు న్యాయవాదులకు సూచించింది.  దీంతో.. వారు తొలుత ఒక గంట పాటు కేసును వాయిదా వేయాలని కోరారు. అసెంబ్లిలో ఉన్నందున జగన్‌ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌లో ఉండడం.. ఆయనను కలిసే అవకాశం లేకపోవడంతో.. ఈ ఒక్కరోజుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలని న్యాయవాదులు కోరారు. వారి విజ్ఞప్తిని మన్నించిన కోర్టు.. కేసును జనవరి 29కి వాయిదా వేసింది. ఆ రోజు జగన్‌ హాజరు కావాలని పేర్కొంది. అదే సమయంలో.. సీబీఐ నుంచి మరిన్ని డాక్యుమెంట్లు అవసరమంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వర్గాలు దాఖలు చేసిన పిటి షన్‌పై జగన్‌ తరఫు న్యాయవాదులు కోర్టుకు పలు విజ్ఞప్తులు చేశారు. సీబీఐ అధికా రులు ఈడీకి డాక్యమెంట్లు ఇచ్చేముందు తమకు చెప్పాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: