ఎన్టీఆర్ పండుగశోభ పేరుతో పేదలకు అందించాల్సిన సరుకుల బహుమతి సంచిని సంక్రాంతి నుంచి అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీతతో చర్చించారు. గోధుమ, శెనగపిండి, కందిపప్పు, నూనె, బెల్లంతో కూడిన ఐదు సరుకులను ఈ సందర్భంగా ప్రత్యేక సంచి ద్వారా అందించనున్నారు. సంక్రాంతి, దసరా, ఉగాది, వినాయకచవితి, రంజాన్, క్రిస్‌మస్ వంటి పర్వదినాల్లో ఈ బహుమతిని అందిస్తారు. ప్రతి నెలా తెల్ల రేషన్ కార్డుదారులకు అందించే సరుకులకు అదనంగా ఈ బహుమతి సంచి ఉంటుంది. దీనికోసం 231 కోట్ల రూపాయల భారం ఖజానాపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనిపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని పరిటాల సునీత శాసనసభలోని తన ఛాంబర్‌లో వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: