హుదూద్‌ తుపాన్‌ నష్టంగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న దానిలో ఒక్కశాతం నిధులు కూడా బాధితుల కోసం ప్రభత్వుం ఇప్పటిదాకా ఖర్చు చేయలేదని విపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హుదూద్‌ పై జరిగిన చర్చలో ఆయన ఆయన మాటాలడుతూ తుపాన్‌ వల్ల 60 నుండి 70 వేల కోట్ల రూపాయలు నష్టం వాటిలినట్లు తొలుత అంచనా వేశారని అన్నారు. పభుత్వం విడుదల చేసిన మొత్తం కేవలం 844.60 కోట్లు మాత్రమే అన్నారు. మత్స్యకారులు తుపాన్‌తో ఘోరంగా నష్టపోయారన్నారు.బాధిత రైతులకు దమ్మిడి కూడా ఇవ్వలేదని అన్నారు. . తుపాన్‌లో 15 లక్షల ఎకరాల్లో చెరుకు, వరి, జీడి, మామిడి, చీని, ఇతర పంటలకు నష్టం జరిగిందని, ఎకరాకు 20వేల చొప్పున నష్టం జరిగిందని అనుకున్నా మొత్తం నష్టం రూ. 3 వేల కోట్లన్నారు. ఇందులో ఒక్క దమ్మిడిని కూడా పంటలు నష్టపోయిన రైతాంగానికి ఈ ప్రభుత్వం చెల్లించలేదని ఆరోపించారు.  రైతులను రుణమాఫీతో మభ్యపెట్టడం వలన రైతులు బ్యాంకు నుండి తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించలేకపోయారని, ఫలితంగా పంటల బీమా పథకంతో వచ్చే ప్రయోజనాలను కూడా రైతులు కోల్పోయారన్నారు. వీటికి బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తుపాన్‌ వలన 60- 70 వేల కోట్ల నష్టం వాటిళ్లిందని వివిధ వర్గాలు అంచనా వేసినా అందులో కేవలం ఒక్క శాతం నిధులను కూడా బాధితులకోసం ప్రభుత్వం ఖర్చు చేయలేదని విమర్శించారు. 400 సోనా బోట్లు, 10 వేల సాధారణ బోట్లు కోల్పోయారని, వాటికి నష్టపరిహారం కింద మత్స్యకారులకు చిల్లిగవ్వకూడా చెల్లించలేదన్నారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన అంశంపై సభలో చర్చ జరుగుతూంటే ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో ఉండకుండా ఇతర కార్యక్రమాలకు ఎలా వెళతారని జగన్‌ ప్రశ్నించారు. సిఎంను సమర్థిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు తన నియోజకవర్గమైన బీమిలిలో తుపాన్‌ సందర్భంగా ఒక్కసారి కూడా పర్యటించలేదని ఆయనకు కష్టాల్లో ఉండే ప్రజలపట్ట ఆరకమైన అభిప్రాయం ఉందన్నారు. ఉత్తరాంధ్రలో వరదలు కూడా వచ్చాయని, వాటితో ఆ ప్రాంతం అతలాకుతలం అయ్యిందన్నారు. నిత్యావసర సరుకులు అందుబాటులో లేవన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కుటుంబానికి రూ. 5వేలు ఇవ్వాలని తాను ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: