వైఎస్ హయాంలో మొదలెట్టిన సంక్షేమ పథకాలను మనం కూడా అమలు పెడుతున్నాం.. అయితే వైఎస్ కు వచ్చినంత పేరు, ఖ్యాతి మనకెందుకు రాలేదు..? అనే ధర్మ సందేహంలో కొట్టుమిట్టాడుతున్నాడట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తాజా క్యాబినెట్ సమావేశంలో కూడా ఆయన ఈ సందేహాన్ని తన మంత్రుల ముందు వ్యక్తపరిచారట. ఈ విషయంలో తన అసంతృప్తిని కూడా తెలియజేశారట ఆయన! వైఎస్ హయాంలో మొదలైన ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ పథకం.. ఇతర పథకాలను చంద్రబాబు కూడా గవర్నమెంటు కూడా కొనసాగిస్తోంది. పేర్లు మార్చి వీటిని కొనసాగిస్తోంది. వీటిలో ఆరోగ్య శ్రీ నిర్వహణ అయితే పర్వాలేదు కానీ... ఇళ్ల కేటాయింపు పథకం అయిన ఇందిరమ్మ నిర్వహణ మాత్రం సరిగా లేదు. ఆరు నెలలు గడుస్తున్నా ఏపీలో కొత్తగా ఒక ఇంటిని కూడా కేటాయించలేదు గవర్నమెంటు! పేరుకు మాత్రం ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం అంటూ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని అంటున్నారు. అయితే తాము రుణాలను మాఫీ చేశామని తెలుగుదేశం వాళ్లు అంటారు. మరి ఆ విధంగానైనా తమకు రైతు బాంధవులు, సంక్షేమ సూత్రధారులు అనే పేరు రావాలి కదా.. అనేది తెలుగుదేశం అధ్యక్షుడి లాజిక్. ఏదేమైనా సంక్షేమ పథకాలను గొప్పగా అమలు చేస్తున్నా... తగిన పేరు ప్రఖ్యాతులు అయితే రావడం లేదని బాబు అసంతృప్తితో ఉన్నారట. మరి అనుకూల మీడియా అండగా ఉన్నా.. అన్నింటినీ హైలెట్ చేస్తున్నా.. బాబుకు ఇలాంటి అసంతృప్తి ఉందంటట.. మరి ఈ అసంతృప్తి తీరెదెలాగో!

మరింత సమాచారం తెలుసుకోండి: