ఇప్పటికే హుదూద్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. హుదూద్ నష్టం గురించి ఏపీ గవర్నమెంటు అంచనాలకూ భిన్నంగా ఉన్నాయి కేంద్రం అంచనాలు. హుదూద్ తో విశాఖ పట్నం చితికి పోగా.. ఈ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఏపీ గవర్నమెంటు కోరింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం దానికి ఒప్పుకోలేదు! కేవలం నాలుగైదు వందల కోట్ల రూపాయల సాయంతో కేంద్రం చేతులు దులిపేసుకొంటోంది. మొదటగా మోడీ ప్రకటించి వెళ్లిని వెయ్యి కోట్ల రూపాయల తక్షణ సాయం కూడా లేనట్టేనని తెలుస్తోంది! దాంట్లో ఇప్పటి వరకూ ఇచ్చిన నాలుగువందల కోట్ల రూపాయలతోనే ఏపీ గవర్నమెంటు సరిపెట్టుకోవాల్సి ఉంటుందని స్పష్టం అవుతోంది. మరి ఆ సంగతి లా ఉంటే.. ఇప్పుడు ఏపీ గవర్నమెంటుకు కేంద్రం మరో షాక్ ను ఇచ్చింది. ఇది విభజన బిల్లుకు సంబంధించిన వ్యవహారం. విభజన చట్టం ప్రకారం ముంపు గ్రామాలు ఏపీలో కలవాల్సి ఉంటుంది. ఆ గ్రామాల్లో విద్యుత్ ప్రాజెక్టులు ఉన్న నేపథ్యంలో వాటి విషయంలో తెలంగాణ గవర్నమెంటు కూడా గోల చేసింది. అయితే తాజాగా కేంద్రం చెబుతున్నది ఏమిటంటే.. ముంపుగ్రామాల్లో ఉన్న విద్యుత్ ప్రాజెక్టుల్లో ఒకటైన దిగువ సీలేరు తెలంగాణకే చెందుతుంది. ఈ మేరకు కేంద్రం నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఈ ప్రకటనను తెలంగాణ ప్రభుత్వం స్వాగతించింది! మరి ఏపీ కి దక్కుతాయనుకొన్న ముంపు గ్రామాల్లోని విద్యుత్ ప్రాజెక్టులు తెలంగాణవి అని కేంద్రం స్పష్టం చేసినట్టుగా అవుతోంది. అయితే ఈ వ్యవహారం గురించి ఏపీ ప్రభుత్వం కానీ, కేంద్రంలోని అధికార పార్టీ ఎంపీలు కానీ పెదవి విప్పలేదు!

మరింత సమాచారం తెలుసుకోండి: