మన తెలుగు కుర్రాళ్లు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. ఇటీవల ఉన్నతవిద్య పూర్తి చేసుకున్న అనేక మంది యువతీ యువకులు క్యాంపస్ సెలక్షన్స్ లో కళ్లు చెదిరే జీతాలందుకుంటున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ వంటి మల్టీనేషనల్ కంపెనీలు టాలెంట్ సెర్చ్ చేస్తూ.. కోట్ల రూపాయల జీతాలు ఆఫర్ చేస్తూ.. వీరిని ఎగరేసుకుపోతున్నారు. ప్రత్యేకించి ఐఐటీల్లో చదువుతున్న యువతీయువకులైతే.. చివరి సంవత్సరంలోనే ఉద్యోగాలు సంపాదించేస్తున్నారు. లేటెస్టుగా.. చిత్తూరు జిల్లాకు చెందన ఓ కుర్రాడు.. ఏకంగా రూ. 2 కోట్ల వార్షికవేతనం అందుకోబోతున్నాడు.                                          చిత్తూరుజిల్లా కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన వినీల్ ప్రతాప్ ను.. ఫేస్ బుక్ సంస్థ.. రెండు కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం ఇచ్చింది. వినీల్ గతంలో ఐఐటీ ముంబైలో బీటెక్ పూర్తి చేశాడు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఎంఎస్ చేస్తున్నాడు. ఈయన చిత్తూరు జిల్లాలోని ఎస్వీటీఎం ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి కుమారుడు. వినీల్ ఇప్పటికే గూగుల్, ఈ-బే సంస్థల్లోనూ ఉద్యోగాలు వచ్చాయట.                               ఇటీవల గూగుల్ సంస్థ కూడా ఓ ఇండోర్ ఐఐటీ విద్యార్థికి భారీ ఆఫర్ తో ఉద్యోగం ఇచ్చింది. గౌరవ్ అగర్వాల్ అనే విద్యార్థికి.. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో కోటీ 80 లక్షల వార్షిక వేతనం ప్రకటించింది. ఇటీవలికాలంలో గూగుల్ ఆఫర్ చేసిన పెద్ద మొత్తంగా చెబుతున్నారు. గూగుల్ అగర్వాల్.. ఇండోర్ లోని ఐఐటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఛత్తీస్ గఢ్ లోని భిలాయ్ కు చెందిన గౌరవ్ ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడు. వచ్చే ఏడాది మే నాటికి ఇంజినీరింగ్ పూర్తి చేసుకోబోతున్న గౌరవ్.. ఆ తర్వాత అమెరికాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో డ్యూటీలో జాయిన్ అవుతాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: