జార్ఖండ్‌ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు వెల్లడిస్తున్నాయి. జమ్మూ-కాశ్మీరులో హంగ్‌ అసెంబ్లిd ఏర్పడు తుందని అంచనా వేశాయి. జార్ఖండ్‌లో రెండో స్థానంలో జార్ఖండ్‌ ముక్తి మోర్చా ఉంటుందని, ఆ తర్వాతి స్థానాల్లో వరుస గా జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా-ప్రజాతాంత్రిక్‌, కాంగ్రెస్‌ నిలుస్తా యని పేర్కొన్నాయి. ఆజ్‌తక్‌-సిసెస్రో అంచనా ప్రకారం 81 స్థానాలున్న జార్ఖండ్‌ శాసనసభలో బీజేపీకి 41 నుంచి 49 స్థానాల మధ్యలో లభించవచ్చు. ఏబీపీ-నీల్సన్‌ సర్వేలో బీజేపీ కూటమికి 52 స్థానాలు దక్కుతాయని వెల్లడైంది. ఇండియా టీవీ-సీ ఓటర్‌ ఎగ్జిట్‌ పోల్‌లో బీజేపీ కూటమికి 37 నుంచి 45 సీట్లు రావచ్చునని పేర్కొంది. బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది. 2009 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, జేఎంఎం చెరొక 18 స్థానాలు దక్కించుకున్నాయి. జమ్మూ-కాశ్మీరు శాసనసభ ఎన్నికలకు సంబంధించి సీ ఓటర్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం ప్రజల తీర్పు అస్పష్టంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.  87 స్థానాలున్న శాసనసభ లో పీపుల్స్‌ డెమొక్రాటిక్‌ పార్టీకి 32 ఉంచి 38 స్థానాలు దక్కుతాయని, ఆ పార్టీ ఏకైక అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని అంచనా. బీజేపీ 27 నుంచి 33 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు 4-10, నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు 8-14 స్థానా లు లభించవచ్చు. 2-8 స్థానాల్లో ఇతరులు విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. జార్ఖండ్‌ సీఎం రేసులో ఉన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘువర దాస్‌ మాట్లాడుతూ తమ పార్టీకి 45 స్థానాలకు తక్కువ రావని తాను జోస్యం చెప్పా నన్నారు. శనివారం సంతాల్‌ పరగణలోని 16 స్థానాలకు రికార్డు స్థాయిలో పోలింగ్‌ జరిగిన నేపథ్యంలో తమకు 45 స్థానాలకు మించి వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అన్ని దశల్లోనూ ఓటింగ్‌ పెరగడం ప్రజలు ముఖ్యంగా యువత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఓటు వేశారనేందుకు సంకేతంగా కనిపిస్తోందన్నారు. జార్ఖండ్‌ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత హేమంత్‌ సొరేన్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ను అంగీకరించలేదు. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ భగత్‌ ఈ సర్వే ఫలితాలను తోసిపుచ్చారు. జార్ఖండ్‌ ఓటర్లలో సగం మంది పల్లెల్లో నివసిస్తున్నారని, సర్వే చేసినవారు వారిలో ఒకరినైనా కలిశారో లేదో తనకు సందేహంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్‌కు 15 స్థానాలకు తక్కువ కాకుండా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: