వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా శకటం ఏర్పాటు గురించి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి రెడ్ సిగ్నల్ ఎదురైంది. ఇదే విషయంలో ఏపీకి మాత్రం గ్రీన్ సిగ్నల్ లభించడం విశేషం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతియేటా రాష్ట్రాలు శకటాలను ప్రదర్శించడం ఆనవాయితే. అయితే ప్రతియేటా ప్రతి రాష్ట్రానికీ ఈ అవకాశం రాదు. ఐదారేళ్లకు గానూ ఒక్కో రాష్ట్రానికి ఈ అవకాశం లభిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో వచ్చే గణతంత్ర దినోత్సవ వేడుకలకు గానూ శకటాన్ని ఏర్పాటు చేస్తామని.. పెరేడ్ సమయంలో దాన్ని ప్రదర్శించడానికి అవకాశం ఇవ్వాలని అటు ఏపీ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు కేంద్రానికి విజ్ఞప్తి చేసుకొన్నాయి. ఈ విజ్ఞప్తులను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రెడ్ సిగ్నల్ వేసి, ఏపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే వచ్చే గణతంత్ర దినోత్సవపు వేడుకల్లో ఏపీ శకటం ఉంటుంది, తెలంగాణ శకటానికి స్థానం లేదనమాట. మరి కొత్తగా ఏర్పాటు అయిన తెలంగాణ రాష్ట్రానికి ఇది నిరాశ కలిగించే అంశమేనని చెప్పవచ్చు. తెలంగాణ ప్రభుత్వం జాతీయ స్థాయిలో తమ ఉనికిని చాటడానికి చాలా ఉత్సాహంతో ఉంది. రిపబ్లిక్ డే పెరేడ్ ను అందుకోసం ఉపయోగించుకోవాలని భావించింది. అయితే ఆ అవకాశం మాత్రం దక్కలేదు. ఏపీకి మాత్రం ఇప్పుడు ఆనందం కలుగుతోంది. 2015 గణతంత్ర దినోత్సవపు వేడుకల్లో ఏపీ తరపున "సంక్రాంతి పండుగ'' శకటాన్ని ప్రదర్శించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: