తెలుగుదేశం అధినేతకు స్వోత్కర్ష చాలా ఎక్కువ అనేది కొత్తగా చెప్పే అంశం ఏమీ కాదు. ఆయన తన గురించి తాను చెప్పుకొంటూనే ఉంటారు. ఎన్నికల ప్రచార సభల్లో నైనా.. చిన్న ప్రెస్ మీట్ పెట్టినా బాబు తన గురించి తాను చెప్పుకొంటారు. తన మేధస్సు ఏ స్థాయిదో... తను ఎంత గొప్ప వాడినో బాబు వివరిస్తారు. ప్రత్యేకించి బాబు టెక్నాలజీ విషయంలో.. దాన్ని వాడు కోవడం విషయంలో తనకు మించిన తోపు లేడని అంటారు. ఆఖరికి సెల్ ఫోన్లు తన వల్లే వచ్చాయని..మీరందరి చేతిలో ఫోన్ ఉంటానికి తనే కారణమని బాబు చెబుతుంటారు. మరి దేశం అంతా సెల్ ఫోన్లు వచ్చాయి కదా.. ఏపీ కి మాత్రమే ముఖ్యమంత్రి అయిన మీరు దేశమంతటికీ ఎలా ఫోన్లు ఇప్పించారు.. అంటే సమాధానం ఉండదు. ఆయన అలా చెబుతుంటారంతే. ఇలాంటి నేపథ్యంలో బాబు అసెంబ్లీలో మరోసారి డబ్బా కొట్టారు. అవకాశం దొరికింది కదా.. అని ఏవేవో చెప్పుకొచ్చారు. హుదూద్ తుపాను గురించి మాట్లాడటమని అడిగితే వెనుకటి కబుర్లను ఎన్నో చెప్పిన చంద్రబాబు పనిలో పనిగా తన డబ్బా కూడా కొట్టుకొన్నారు. వెనుకటికి ఒడిశాలో తుపాను వస్తే.. తను హెలీ కాప్టర్ తో జనాల్ని తరలించానని బాబు చెప్పారు. తను రంగంలోకి దిగి, ఒడిశా సీఎంకు శాటిలైట్ ఫోన్ కూడా తానే ఇచ్చానని బాబు చెప్పుకొన్నారు. మరి ఒడిశా సీఎం గురించి ఏపీ జనాలకు ఎందుకు? ఆయన కన్నామీరు ఎంత గొప్పవాళ్లు అయినా కావొచ్చు. ఇలా గొప్పలు చెప్పుకోవడానికి అలాంటి విషయాలను వాడుకోవడం విచిత్రంగా ఉంటుంది. ఇలా బాబు తన డబ్బా కొట్టుకోవడం.. తన దరువు వేసుకోవడం అభిమానులు కూడా హర్షించలేని విషయం. ఎవరి గొప్పలు వారు చెప్పుకొంటే వినడానికి ఏం బావుండదు. ఆ విషయం బాబుకు ఎప్పటికి అర్థమయ్యేనో!

మరింత సమాచారం తెలుసుకోండి: