తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో వ్యవహరిస్తున్న తీరు చోద్యంగా ఉంటుంది. ఏ అంశం చర్చకు వచ్చినా తెలుగుదేశం పార్టీ ఒకే సమాధానం చెబుతూ ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ వాళ్లు ఏ అంశాన్ని ప్రస్తావించినా తెలుగుదేశం వాళ్లు ఒకే చోటికి వచ్చి ఆగిపోతుంటారు. అదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసే అంశం దగ్గరకు! అయితే ఇలా ఎన్ని రోజులో అర్థం కాదు. క్రితం సారి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇలాగే జగన్ పై విరుచుకుపడింది. ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ ఏదో అంశాన్ని రైజ్ చేస్తే... తెలుగుదేశం వాళ్లు జగన్ అవినీతి అన్నారు. రైతు రుణమాఫీ ఎక్కడా.. అని వైకాపా ప్రశ్నిస్తే.. మీరు లక్ష కోట్లు దోచుకొన్నారు కదా.. అ డబ్బు ఇవ్వండి మాఫీ చేస్తాం అన్నారు! ఇక ప్రస్తుత శీతాకాలసమావేశాల సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ ఏకైక అస్త్రంతో బరిలోకి దిగింది. ప్రతిపక్ష పార్టీ ఏంఅడిగినా.. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎవరో ఒకరు రెచ్చిపోతారు. జగన్ పై విరుచుకుపడతారు. జగన్ అవినీతి పరుడని.. ఆయనకు ప్రశ్నించే అర్హత లేదని అంటారు. అయితే ఏదో ఒక అంశం గురించి, ఒకరోజున ఇలా మాట్లాడితే బావుంటుందేమో కానీ.. ప్రతి అంశం గురించి కూడా ఇలా మాట్లాడితే మాత్రం జనాలు కూడా హర్షించలేరు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం జగన్ పై విరుచుకుపడుతోంది తప్ప.. మరోటి కాదని అందరికీ అర్థం అవుతుంది. ప్రజా సమస్యల విషయంలో సమాధానం చెప్పాల్సిన బాధ్యతను తప్పించుకోవవడానికి తెలుగుదేశం ప్రభుత్వం జగన్ ను కార్నర్ చేస్తోందని అనుకొంటారంతా. తెలుగుదేశం ఈ విషయాన్ని గ్రహించడం లేదు. ఇప్పటికే ఐదేళ్లుగా జగన్ అవినీతి గురించి తెలుగుదేశం మాట్లాడుతోంది. ఇది విని వినీ జనాలకు కూడా ఒక రకంగా చిరాకు వస్తోంది. వీలైనంత త్వరగా వ్యూహాన్ని సమీక్షించుకోకపోతే.. తెలుగుదేశం పార్టీకే మైనస్ పాయింట్ అవుతుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: