తమ దేశంలోని సోనీ పిక్చర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌పై సైబర్‌ దాడులు చేస్తామంటూ వచ్చిన బెదిరింపు లను ఎదుర్కొనేందుకు తమకు సాయం చేయాలని అమెరికా చైనాకు విజ్ఞప్తి చేసింది. ఈ హెచ్చరికలు తమకు ఉత్తర కొరియా నుండి అందినట్లు అమెరికా అధికారి ఒకరు చెప్పారు. ఈ దాడుల గురించి చైనాకు తాము సమాచారం అందించామని, ఈ దాడులను ఎదుర్కో నటంలో సహకరిం చాలని కోరామని ఆయన వివరించారు. అమెరికా విజ్ఞప్తి మేరకు సహకరించేందుకు చైనా అంగీకరించిందని, సైబర్‌స్పేస్‌లో నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ జరిగే విధ్వంసక దాడులను సంయుక్తంగా ఎదుర్కొం టామని ఆయన చెప్పారు. ప్రస్తుతం హవాయిలో శీతాకాలం సెలవుల్లో వున్న అధ్యక్షుడు ఒబామా సోనీ నెట్‌వర్క్‌పై వచ్చిన దాడుల హెచ్చరికలకు ఎలా స్పందించాలన్న విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉ.కొరియా, చైనాలకు మధ్య స్నేహ సంబంధాలున్న నేపథ్యంలో ఇందులోకి చైనా జోక్యాన్ని ఆహ్వానిస్తే సమస్యలు ఎదురవు తాయని ఒబామా భావిస్తున్నారని ఈ వర్గాలు వివరించాయి.   సోనీ సంస్థపై జరిగిన సైబర్‌ దాడి సైబర్‌ విధ్వంసం వంటిదేనని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అభిప్రాయపడ్డారు. అంతకు ముందు ఈ సైబర్‌ దాడిని ఉత్తర కొరియా ప్రేరేపిం చిందంటూ ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ దాడిపై ఏ విధంగా స్పందించాలన్న అంశంపై ఒబామాతో పాటు ఆయన సలహా దారులు సుదీర్ఘ సమాలో చనలు చేస్తున్నారు. సోనీ సంస్థపై జరిగిన హాకింగ్‌ అత్యంత వ్యయభరితమైన సైబర్‌ విధ్వంసమేనని, దీనిని తీవ్రంగా పరిగణించి తగు విధంగా స్పందించాల్సినఅవసరం వుందని ఒబామా ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఉత్తర కొరియాను ఉగ్రవాద ప్రాయోజిత దేశాల జాబితాలో చేర్చే అంశాన్ని తమ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నదని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: