జూపూడి ప్రభాకర్ రావు వైకాపాను వీడిన సంగతి తెలిసిందే. వైఎస్ మరణం తర్వాత.. ఆ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు జూపూడి. ఆ తర్వాత వైకాపాలో క్రియాశీలం అయ్యాడు. వైకాపా తరపున మౌత్ పీస్ అయ్యాడు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిలో ఉన్న జూపూడి వైకాపా తరపు ఉన్నన్ని రోజులూ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడే వాడు. అయితే ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో జూపూడీ వైకాపాకు దూరం అయ్యాడు. ఆరు నెలలు గడిచే సరికి ఇప్పుడు తెలుగుదేశం పంచన చేరాడు. మరి ఇక నుంచి ఆయన వైకాపాను ఏ రకంగా విమర్శిస్తాడో చూడాలి. ఆయన సంగతి అలా ఉంటే.. జూపూడి అలా చేరగానే.. జగన్ వైపుకు వస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు మందకృష్ణ మాదిగ. జూపూడి మాలవర్గానికి ప్రతినిధిని అని చెప్పుకొంటాడు. అలాంటి జూపూడి ఉన్న వైకాపాకు దూరంగా ఉండే వాడు మందకృష్ణ. ఇప్పడు జూపూడి వెళ్లి చంద్రబాబుతో చేతులు కలపడంతో.. ఇన్ని రోజులూ బాబుకు అనుకూలంగా మాట్లాడిన మందకృష్ణ జగన్ కు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు. సోమవారం ఉదయం ఏపీ అసెంబ్లీలోని చాంబర్ లో జగన్ ను వెళ్లి కలిశాడు మందకృష్ణ. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డితో మందకృష్ణ చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ విదంగా జగన్ కు జూపూడి టాటా చెబితూ... మందకృష్ణ చేతులు కలుపుతున్నాడు. రాజకీయాల్లో ఇలాంటి ప్లస్ లూ, మైనస్ లు మామూలేనేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: